అత్తగారి ముందు బికినీ ధరించిన కరీనా
ముంబై: బహుషా కరీనా కపూర్ ఖాన్ మాదిరి ఇతర భారతీయ మహిళలు అంత అదృష్ట వంతులు కారేమో?, ఎందుకంటే సైఫ్ అలీఖాన్‌తో పెళ్లయిన తర్వాత కూడా కరీనాకు ఫుల్ ఫ్రీడమ్ లభిస్తోంది. అత్తింట్లో కూడా పుట్టింట్లో ఉన్నంత హాయిగా ఉంటోందట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇంటర్య్వూలో కూడా వెల్లడించారు.
ఓ ప్రముఖ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా కపూర్ ఖాన్ మాట్లాడుతూ..'అత్తగారైన షర్మిలా ఠాగూర్ నన్ను కూతురులా చూసుకుంటారు. మనం 1900 నాటి కాలంలో లేము. కాలంతో పాటు అత్తా కోడళ్లు మధ్య రిలేషన్లో కూడా మార్పు వచ్చింది. ఇటీవల మాల్దీవులకు హాలిడేకు వెళ్లాం. అక్కడ అత్తాగారి ముందు నేను బికినీ కూడా ధరించాను. ఈ కాలంలో ఇది నార్మలే' అని వ్యాఖ్యానించారు కరీనా.
పెళ్లికి ముందు కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి 'టషన్' సినిమాలో నటించింది. ఈ సినిమాలో కరీనా జీరో సైజు బాడీతో సెక్సీగా తన పరువాలను ఆరబోస్తూ బికినీలో దర్శనం ఇచ్చింది. కరీనా అత్తగారు, మాజీ బాలీవుడ్ హీరోయిన్ అయిన షర్మిలా ఠాగూర్ కూడా అప్పట్లో సినిమాల్లో హాట్ హాట్‌గా నటించారు.
మేగజైన్‌పై బికినీతో ఫోజులు ఇచ్చిన తొలి ఇండియ్ హీరోయిన్‌గా షర్మిలా ఠాగూర్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించారు. ఆమె బికినీ వేసి మేగజైన్‌పై దర్శనం ఇచ్చిన విషయం అప్పట్లో పార్లమెంటులో కూడా చర్చనీయాంశం అయిందట. తన లాగే కోడలు కరీనా కూడా సినిమా హీరోయినే కాబట్టి ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాడింగ్ ఉంది.


Click it and Unblock the Notifications












