మనం మూవీకి 6 ఏళ్లు.. ఎమోషనల్ అయిన కింగ్ నాగ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు విరుస్తాయి. ఎప్పడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సరదాగా కనిపించే నాగ్, సడన్ గా సీరియెస్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. అంటే మరీ దేవదాస్ రేంజ్ లో కాదనుకోండి. మనసు కాస్త బరువెక్కే విధంగా కాస్త ఎమోషనల్ అయ్యాడు. మన్మథుడే డీలా పడ్డాడంటే... పెద్ద కారణమే ఉండి ఉంటుంది.
ఇంతకూ విషయం ఏమిటంటే అక్కినేని వారి కుటుంబ చిత్రంగా పేరుగాంచిన మనం విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తైంది. అంతేకాదు, నాగ్ ను మంచి నటుడిగా ఇండస్ట్రీలో నిలబెట్టిన అన్నమయ్య సినిమా కూడా మే 22న రిలీజ్ అవ్వడంతో ఈ రెండు రోజులూ తన జీవితంలో అత్యంత విశేషాన్ని సంతరించుకున్నవిగా ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ఇదే ఆఖరి చిత్రం కావడంతో, నాగ్ పోస్ట్ తో అందరూ కనెక్ట్ అయిపోయారు.

ఈ రెండు సినిమాల దర్శకులు రాఘవేంద్ర రావు, విక్రమ్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశాడు.
మరోపైపు నవ యువ మన్మథుడు నాగ చైతన్య సైతం మనం పోస్టర్ ను షేర్ చేస్తూ తాతగారిని గుర్తుచేస్తుకున్నాడు. సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ స్పెషల్ థాంక్స్ చెప్పాడు. మనం సినిమాలో ఏఎన్ ఆర్ తో పాటూ నాగార్జున, నాగచైతన్య, అఖిల్ నటించగా, అక్కినేని వారి కోడలు సమంత కూడా కీలక పాత్ర పోషించింది.


Click it and Unblock the Notifications











