కొమరం పులితో ఖలేజా కు మొదలైన కష్టాలు..
ఇటీవల విడుదలై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ గా కొమరం పులి చోటుసంపాదించుకునే అంచనాలు వెలువడడం తెలిసిందే. ఈ చిత్రం ప్రీమియర్ షో చూసిన చిరంజీవి కూడా అదోలో అనడం మెగా ప్యామిలీ సన్నిహిత వర్గాలు ఇప్పుడిప్పుడే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తానే విడుదల చేస్తానని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అల్లు అరవింద్ ఆ తర్వాత సడన్ గా ప్లేటు ఫిరాయించారు. ఇకపోతే కొమరం పులి చిత్రం తాలూకా ఫ్లాప్ అంతా ఖలేజా పై పడనుందని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలకు ఒకరే నిర్మాత కావడంతో ఈ పరిణామం అనివార్యమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కొమరం పులి చిత్రం కోనుకున్నవాళ్సు, అడ్వాన్సులిచ్చి విడుదల చేసినవాళ్సు నూటికి తొంబై శాతం నష్టపోవడం ఖరారైపోవడంతో, ఈ చిత్రం ద్వారా తమకు జరిగిన నష్టాన్ని ఖలేజాతో పూడ్చుకోవాలని వారంతా భావిస్తున్నారని ఫిలిమ్ వర్గాల సమాచారం. ఐతే ఈ పరిణామం నిర్మాత శింగనమల రమేష్ కు ఆశనిపాతం కానుంది. ఎందుకంటే ఖలేజా చిత్రానికి కూడా నిర్మాత ఈయనే కాబట్టి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ యితే తప్ప పెట్టిన పెట్టుబడి మొత్తం రాని పరిస్తితిలో ఆయన ఉన్నారు. కాబట్టి కొమరం పులి ఫ్లాప్ భారాన్ని ఖలేజా మోసి ఆయనను గట్టెంక్కించాలని మనమందరం కోరుకుందాం....


Click it and Unblock the Notifications











