చిరంజీవి కంటతడి పెట్టడంపై దర్శకుడు కృష్ణ వంశీ హ్యాపీ!

By Bojja Kumar

హైదరాబాద్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమాలు ఫ్యామిలీ, సోసైటీ రిలేషన్ గుర్తు చేస్తూ హార్ట్‌కి కనెక్ట్ అయ్యి ఎమోషన్ అయ్యేలా ఉంటాయి. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా, సింధూరం, చక్రం లాంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఎమోషన్‌కు గురి చేసి కంటతడి పెట్టించాయి. తాజాగా కృష్ణ వంశీ తరకెక్కిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా అలానే ఉండనుందని తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసిన చిరంజీవి ఎమోషన్‌కు గురయి కంటతడి పెట్టారట.

ఈ విషయం గురించి దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ....‘ఇటీవలే గోవిందుడు అందరి వాడేలే చిత్రం ఫైనల్ కాపీ చిరంజీవి గారికి, సురేఖ గారికి చూపించాం. సినిమా ముగిసిన తర్వాత ఇద్దరి కళ్లలో నీళ్లు తిరగడం చూసాను. రీ రికార్డింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి కానప్పటికీ సినిమా వారిని ఎంతగానో ఆకట్టకుంది. చిరంజీవిగా నుండి ఆ రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను' అని తెలిపారు.

When Krishna Vamshi Felt Happy To See Chiranjeevi In Tears!

ఈ మధ్య కాలంతో తెలుగు సినిమా పరిశ్రమలో యాక్షన్, కామెడీ చిత్రాల జోరు ఎక్కువైంది. అలాంటి రోటీన్ మసాలాతో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయితే అందుకు భిన్నంగా ఫ్యామిలీ రిలేషన్ షిప్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతూ రంజింప చేస్తుందని దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం అక్టోబర్ 1న గ్రాండ్‌గా విడులవుతోంది. ఈచిత్రంలో రామ్ చరణ్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలీనీ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X