»   » సూసైడ్ చేసుకునే పరిస్దితే, పవన్ కోసం పోగ్రామ్ చేస్తా, వర్మ చెప్పింది కరెక్టే: నాగబాబు

సూసైడ్ చేసుకునే పరిస్దితే, పవన్ కోసం పోగ్రామ్ చేస్తా, వర్మ చెప్పింది కరెక్టే: నాగబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ కెరీర్ లో ఎత్తు పల్లాలు సహజం. అయితే ఈ మాటలు చెప్పినంత ఈజీ కాదు...వాటిని నిజ జీవితంలో అనుసరించటం. ఊహించని దెబ్బలు ఒక్కోసారి ఎంతటి వారినైనా క్రుంగదీసేస్తాయి. ఎంత మానసిక స్దైర్యం ఉన్నవారినైనా విరక్తి కలిగేలా చేస్తాయి. అలాంటి పరిస్దితే నాగబాబుకు వచ్చిందిట. అప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారట.

వివరాల్లోకి వెళితే.. రామ్‌చరణ్‌, జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం 'ఆరెంజ్‌' . ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నమోదైంది. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే...అప్పట్లో ఈ చిత్రం ఫ్లాఫ్ ప్రభావం...నిర్మాత మెగా బ్రదర్ నాగబాబుని ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకుని వెల్లిందిట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ ఇంటర్వూలో తెలియచేసారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. తనకు నిర్మాతగా భారీ నష్టాలు వచ్చిన మాట నిజమేనని, తనకున్న మొత్తం అమ్మేసి అప్పుల పాలయ్యానని చెప్పారు. అయితే దానికి తాను చరణ్ బాబుపైన కానీ, డైరెక్టర్‌పై కానీ నింద వేయనని అన్నారు.

ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన ..

ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన ..

అయితే ఆరెంజ్ నష్టాల తర్వాత తాను తన రోజువారీ అవసరాలను కూడా ఆపేసుకుని, బ్రదర్స్‌ను డబ్బులు అడగాల్సిన పరిస్థితిలోకి వెళ్లిపోయానని చెప్పారు. ఆ సమయంలో తాను ఆత్మహత్య కూడా చేసుకుందామని ఆలోచించిన మాట నిజమేనని చెప్పారు.

కానీ అన్న, తమ్ముడు ఫోన్ చేసి

కానీ అన్న, తమ్ముడు ఫోన్ చేసి

తాను పిల్లల ఎదుగుదలకు, ఫ్యామిలీకి, అన్న, తమ్ముడికి ఉపయోగపడలేకపోతున్నానని ఒక విధమైన భావనలోకి వెళ్లిపోయానని చెప్పారు. అయితే తనకు అటు అన్న చిరంజీవి, ఇటు తమ్ముడు పవన్ ఆ సమయంలో విడివిడిగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలిపారు.

భరోసా ఇచ్చారు

భరోసా ఇచ్చారు

చిరు, పవన్ ఫోన్ చేసినట్టు ఒకరికొకరికి తెలియదని తనకు మాత్రమే తెలుసని చెప్పారు. ఇరువురు తామున్నామని, నష్టాల గురించి మర్చిపోవాలని భరోసా ఇచ్చారని చెప్పారు. వారు బాధ పడతారనే ఉద్దేశంతో తాను తన నిర్ణయాన్ని మార్చుకుని ఫైట్ చేయ్యాలని అనుకున్నట్టు తెలిపారు నాగబాబు.

లేటుగా విమర్శ చేసా

లేటుగా విమర్శ చేసా

అలాగే తాను రైటర్ యండమూరి విషయంలో తాను చేసిన కామెంట్లను మెగా బ్రదర్ నాగబాబు సమర్ధించుకున్నారు. అయితే చాలా ఆలస్యంగా విమర్శలు చేసినందుకు మాత్రం బాధపడుతున్నానని చెప్పారు.

నిజమే..వర్మ చెప్పింది

నిజమే..వర్మ చెప్పింది

చిరు లేకపోతే నాగబాబు జీరో అంటూ రాంగోపాల్ వర్మ చేసిన విమర్శలపై నాగబాబు స్పందిస్తూ అన్నయ్య, తమ్ముడు లేకపోతే తాను జీరోనే అని నాగబాబు ఒప్పుకున్నారు. జనసేన తరపున సాధారణ కార్యకర్తగా ప్రచారం చేస్తానని చెప్పారు. జనసేనలో పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు.

శ్రుతి మించిన కామెడీ

శ్రుతి మించిన కామెడీ

ఈటీవి చానల్‌లో ప్రసారమవుతున్న ‘జబర్దస్' కామెడీ షోలో బూతు శ్రుతిమించడంపై నాగబాబు స్పందించారు. ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ‘జబర్దస్త్'లో ఒక్కోసారి శ్రుతిమించిన కామెడీ బూతుగా మారడం తనను కూడా ఇబ్బందికి గురిచేస్తుందని పేర్కొన్నారు.

మళ్లీ మొదలెట్టేస్తున్నారు

మళ్లీ మొదలెట్టేస్తున్నారు

అయితే ఆ విషయాన్ని షో జరుగుతుండగా చెప్పే అవకాశం ఉండదు కాబట్టి ఆ తర్వాత వారికి చెప్పి స్కిట్లలో బూతు తగ్గించమని చెబుతుంటానని వివరించారు. కొంతకాలం పాటు తన సలహాను పాటిస్తున్న టీములు తర్వాత మళ్లీ మొదలుపెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్యామిలీ అంతా చూస్తారు

ఫ్యామిలీ అంతా చూస్తారు

‘జబర్దస్త్'ను కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆస్వాదిస్తుంటారు కాబట్టి వీలైనంతగా వల్గారిటీ లేకుండా చూసుకోవాలనే తాను చెబుతుంటానని నాగబాబు వివరించారు. ఈ మధ్యకాలంలో కాస్త బూతు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ పోగ్రామ్ హైయిస్ట్ రేటింగ్ ఉన్న పోగ్రామ్.

అందులో వింతేమీ లేదు

అందులో వింతేమీ లేదు

ఉదంయ లేస్తే చిరంజీవిపై విరుచుకుపడే రోజాతో జబర్దస్త్‌లో విరగబడి ఎలా నవ్వుతున్నారంటూ ఓ న్యూస్‌చానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తాము చేస్తున్నది ఓ కామెడీ కార్యక్రమమని పేర్కొన్న నాగబాబు కార్యక్రమంలో రోజా జడ్జిగానే వ్యవహరిస్తారని పేర్కొన్నారు. బయటకెళ్లాక ఆమె పార్టీ విధానాలకు అనుగుణంగా అన్ని పార్టీలపైనా విమర్శలు చేస్తుంటారని, అందులో వింతేమీ లేదని తేల్చి చెప్పారు. రోజా ఒక్క చిరంజీవినే విమర్శించరని, టీడీపీ నేతలను కూడా విమర్శిస్తుంటారని తెలిపారు. కార్యక్రమం వేరు, పార్టీ వేరని పేర్కొన్నారు.

వరసపెట్టి సినిమాలు

వరసపెట్టి సినిమాలు

చిరంజీవి రాజకీయాల్లో కొనసాగుతారా అనేది తాను చెప్పలేనని అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పడిపోయిందని, ఇప్పట్లో అది కోలుకునే పరిస్థితి కూడా లేదని అన్నారు. పార్టీ పరంగా కూడా కొనసాగుతాడా లేదా అన్న విషయం చిరంజీవికే తెలుసని చెప్పాడు. అయితే సినిమా విషయంలో మాత్రం నటుడిగా కొనసాగుతారని, చాలా ఎక్కువ సినిమాలే తీయడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు.

మోదీ నిర్ణయం మేలే

మోదీ నిర్ణయం మేలే

నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీని పొగుడుతూ తాను యూట్యూబ్‌లో పెట్టిన వీడియోపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పొగిడారని మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అన్న కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నా తాను బీజేపీని ప్రశంసించడాన్ని చిరంజీవి సీరియస్‌గా తీసుకోలేదని ఆయన తెలిపారు. అంతేకాదు బాగా మాట్లాడానని కితాబు కూడా ఇచ్చారని నాగబాబు తెలిపారు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశానికి మేలు చేసేదేనని ఇప్పటికీ చెబుతానని నాగబాబు వివరించారు.

పోరాడే తత్వం ఉంది

పోరాడే తత్వం ఉంది

పవన్ కళ్యాణ్ రాజకీయాలపై తాను త్వరలోనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం చేస్తానన్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఒక ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడుతూ.. రాజీ పడని వ్యక్తి, నష్టపోయినా పోరాడే తత్వం గలవాడని చెప్పారు. కమ్యునిజమ్, క్యాపిటలిజమ్, తత్వశాస్త్రాలను చదివాడన్నారు. ఇలాంటి ఎన్నో లక్షణాలున్న పవన్ ఒక చోటనే ఇమడలేక సమాజానికి ఏదో చెయ్యాలని భావించాడని తెలిపారు. ఈ క్రమంలోనే జనసేన అవతరించిందని చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా చెయ్యాలనిపిస్తే అది జనసేన ద్వారానే చేస్తానని, పవన్‌కు తన చేతనైన సహాయం చేస్తానని అన్నారు నాగబాబు.

English summary
Nagababu shares his bitter experience and talks about the people who stood behind him in tough times.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu