»   » అదో సంచలనం: మెగాస్టార్‌పై హీరోయిన్ కిడ్నాప్, హత్యాయత్నం...ఆరోపణలు!

అదో సంచలనం: మెగాస్టార్‌పై హీరోయిన్ కిడ్నాప్, హత్యాయత్నం...ఆరోపణలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఒకప్పటి హీరోయిన్ పర్వీన్ బాబీ ఎఫైర్ గురించి అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో అదో హాట్ టాపిక్. ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య డేటింగ్ మొదలైందని చెబుతుంటారు.

అయితే అమితాబ్‌కు అప్పటికే జయా బచ్చన్‌తో వివాహం జరుగడం, పర్వీన్ బాబీతో ఎఫైర్ విషయం మీడియా కంట పడటంతో.... అమితాబ్ ఆమెను వదిలేసాడనే రూమర్స్ అప్పట్లో వినిపించాయి. తర్వాత పర్వీన్ బాబీ మీడియా ముందుకొచ్చి...అమితాబ్ ఒక గ్యాంగ్ స్టర్ అని, తనను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించాడని సంచలన ఆరోపణలు చేసింది.

ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిదంటే

ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిదంటే

అప్పట్లో ఓ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్వీన్ బాబీ మాట్లాడుతూ... అమితాబ్ బచ్చన్ ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్ అంటూ ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న రోజుల్లో ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కిడ్నాప్ చేసి ఐలాండ్ లో బంధించారంటూ

కిడ్నాప్ చేసి ఐలాండ్ లో బంధించారంటూ

అమితాబ్ మనుషులు తనను కిడ్నాప్ చేసి ఐలాండ్ లో బంధించారని, తనకు సర్జరీ నిర్వహించి కుడి చెవి కింద ఒక ట్రాన్స్ మీటర్/చిప్ అమర్చారని ఆమె ఆరోపించారు.

అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు

అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు

అప్పట్లో ఈ విషయమై పర్వీన్ బాబీ అమితాబ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుకు లాగారు. అయితే కోర్టులో అమితాబ్ కు క్లీన్ చిట్ లభించింది. పర్వీన్ మానసిక వ్యాధితో బాధ పడుతుందని పోలీసులు తేల్చేసారు.

పర్వీన్ ఆరోపణల మీద అమితాబ్ స్పందిస్తూ..

పర్వీన్ ఆరోపణల మీద అమితాబ్ స్పందిస్తూ..

అప్పట్లో పర్వీన్ ఆరోపణల మీద అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ.... ఆమె మానసిక వ్యాధితో బాధపడుతుండటం వల్లే ఇలాంటి ఆరోపణలు చేసారని, ఆమె ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నందుకు చింతిస్తున్నానని తెలిపారు.

ఒకే సోషల్ సర్కిల్

ఒకే సోషల్ సర్కిల్

తాము ఒకే సోషల్ సర్కిల్ కు చెందిన వారము. తరచూ కలుసుకునే వారము. ఆమె వెరీ ఫన్ లవింగ్, లైట్ హార్టెడ్ పర్సన్.... ఎప్పుడూ సంతోషంగా, జాలీగా ఉండే స్వభావము. అలాంటి వ్యక్తికి ఇలా జరుగడం చాలా బాధ కరమని అప్పట్లో అమితాబ్ మీడియాతో వ్యాఖ్యానించారు.

ఫీలింగ్ బ్యాడ్

ఫీలింగ్ బ్యాడ్

ఆమె ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ వెళ్లి పోయేది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చే రకం కాదు. ఎందుకు ఇలా అయిందో తెలియదు.... నాకు చాలా బాధగా ఉంది అంటూ అమితాబ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఫర్వీన్ బాబీ గురంచి వెల్లడించారు.

పర్వీన్ స్థితి ఇలా కావడానికి కారణం?

పర్వీన్ స్థితి ఇలా కావడానికి కారణం?

కబీర్ బేడీ, అమితాబ్ బచ్చన్, మహేష్ భట్ లతో ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ కావడం వల్లనే పర్వీన్ బాబీ డిప్రెషన్లోకి వెళ్లి మానసికంగా కృంగి పోయారనే... రూమర్స్ అప్పట్లో వినిపించాయి.

2005లో మృతి

2005లో మృతి

పర్వీన్ బాబి జనవరి 20, 2005లో మరణించారు. మరణించే సమయానికి ఆమె వయసు 55.

English summary
Everyone in Bollywood knows about the affair of Amitabh Bachchan and Parveen Babi (which is not a secret anymore). The two worked in many films together and soon started dating. As per rumours, when this caught the attention of the media, Amitabh Bachchan, who was already married to Jaya, left Parveen Babi. Later, Parveen shocked everyone claiming that Amitabh was a gangster, who tried to kidnap and kill her. Parveen Babi died tragically on 20th January 2005, at the age of 55.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu