twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతులు మాట్లాడి నెగిటివిటీ పెంచొద్దు: పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడి కౌంటర్

    |

    Recommended Video

    Tammareddy Bharadwaj Strong Counter To Pawan Kalyan Fans || Filmibeat Telugu

    'నా ఆలోచన' పేరుతో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసిన కామెంట్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అయితే కొందరు తనను దారుణంగా ట్రోల్ చేయడంతో తమ్మారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

    'నేను ఓ వీడియో పెడితే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొందరు నాపై కోపగించుకున్నారు. మీరు మాకు చెప్పడం కాదు.. యూట్యూబ్ నుంచి బయటకు వచ్చి చూడండి అని విమర్శించారు. నాపై అలాంటి కామెంట్లు చేస్తున్న వారికి నేను చెప్పేది ఒకటే. నేను యూట్యూబ్‌లో మాత్రమే ఉండటం లేదు. ప్రజల్లో కూడా తిరుగుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాను.' అని తమ్మారెడ్డి తెలిపారు.

    నాకు నేను ఆత్మ విమర్శ చేసుకునే విధంగా ఉండాలి

    నాకు నేను ఆత్మ విమర్శ చేసుకునే విధంగా ఉండాలి

    ఎవరిపై అయినా కామెంట్ చేసే ముందు, ట్రోల్ చేసే ముందు వారి గురించి తెలుసుకోండి. ఊరికే ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు. ట్రోలింగ్ అనేది పాజిటివ్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ తప్పులు ఉంటాయి. నాలో తప్పులు ఉండవు అనడం లేదు. మీరు నాపై ట్రోలింగ్ చేస్తే మీరు చెప్పేది నిజమే కదా అని నాకు నేను ఆత్మ విమర్శ చేసుకునే విధంగా ఉండాలి. అంతే కానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయవద్దు అని తమ్మారెడ్డి సూచించారు.

    ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. అంటాం... అనడం మన హక్కు

    ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. అంటాం... అనడం మన హక్కు

    నేను చెప్పే ఏ వీడియోలో అయినా ఇది నా ఆలోచన అన్నాను కానీ... మీ ఆలోచన అనలేదుకదా. మీకు ఇంకేమైనా ఆలోచన ఉంటే నాకు చెప్పండి, నేను కూడా దాని గురించి ఆలోచిస్తాను. అంతే కానీ రోడ్డు మీదకు రా, పక్కకు వెళ్లు, మా వాళ్లను అనడానికి నువ్వు ఎవరు? అనడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. అంటాం... అనడం మన హక్కు. కరెక్టుగా అంటున్నామా? తప్పుగా అంటున్నామా? అనేది చెప్పండి. నేను తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పండని వ్యాఖ్యానించారు.

    మీలాంటి వారి వల్లే నాయకులు ఓడిపోయారు

    మీలాంటి వారి వల్లే నాయకులు ఓడిపోయారు

    మీరు చేస్తున్న పనికిరాని ట్రోలింగ్ వల్ల మీలో నెగెటివిటీ పెరుగుతోంది. మీ లాంటి వారు ఏ నాయకుడిని సపోర్టు చేసినా ఆ నాయకుడికి కూడా నెగెటివిటీ వెళుతుంది. వారి నాయకత్వం కూడా మీ దెబ్బ వల్ల నాశనం అవుతుంది. మీరు ఇలా నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం వల్లే చాలా మంది నాయకులు ఓడి పోయారని తమ్మారెడ్డి తెలిపారు.

    బూతులు మాట్లాడి నెగిటివిటీ పెంచుకోవద్దు

    బూతులు మాట్లాడి నెగిటివిటీ పెంచుకోవద్దు

    అనవసరంగా బూతులు మాట్లాడి మీ మానసిక స్థితిని చెడగొట్టుకుని.. మానసిక పరిపక్వత లేకుండా పోయి సైకియార్టిస్టు దగ్గరకు వెళ్లే పరిస్థితి తెచ్చుకున్నారు. మీరు ఆ పరిస్థితి తెచ్చుకుని మీ నాయకుడిని రోడ్డు మీద పడేయొద్దు. నాయకులంతా సమాజానికి ఎంతో కొంత సేవ చేద్దామని వచ్చినవారే. ఆ మేలు చేయడానికి వారికి అవకాశం ఇవ్వాలంటే మనం నెగెటివిటీ తగ్గించుకోవాలి. మీ నెగెటివిటీ వారికి రిఫ్లెక్ట్ అయ్యేలా చేయొద్దన్నారు.

    English summary
    Tammareddy Bharadwaj About PAWAN KALYAN. When Pawan Kalyan Fans Got FIRED Heavily By Tammareddy Bharadwaj Over His Comments on Janasena Party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X