»   » ఎందుకు ఎదగనిస్తారు? దెబ్బలు, అవమానాలు: చిరంజీవి గురించి పవన్!

ఎందుకు ఎదగనిస్తారు? దెబ్బలు, అవమానాలు: చిరంజీవి గురించి పవన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: యుక్తా(యూనైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్) వార్సికోత్స వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వేడుకలు ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ కొన్ని ఎన్నారైలతో కలిసి డిన్నర్ చేసారు.

పవన్ కళ్యాణ్ ఎన్నారైలతో కలిసి డిన్నర్ చేస్తూ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇదంతా ఫేస్ బుక్ లో లైవ్ గా ప్రసారం అయింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అన్నయ్య చిరంజీవి గురించి ప్రశ్నించారు. చిరంజీవి మీకు , మీ ఫ్యామిలీకి ఎలాంటి లెగసీ(వారసత్వం) ఇచ్చారు అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ హార్ట్ ఫుల్ గా సమాధానం ఇచ్చారు. నేను మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. విలేజ్ లో పెరిగాయి. చాలా లిమిటెడ్ ఎక్స్ ఫోజర్ వాతావరణంలో పెరిగాయి. అప్పుడు ఊర్లో ఓ సెంటర్ కెళ్లి సినిమా చూస్తేనే పండగలా అనిపించేంది. అలాంటి నేను ఎప్పుడూ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. కానీ అన్నయ్య అలా కాదు...(మిగతా వివరాలు, పవన్ మాల్లాడిన వీడియో స్లైడ్ షోలో)

యాక్టర్ కావాలని డ్రీమ్

యాక్టర్ కావాలని డ్రీమ్

యాక్టర్ అవ్వాలని అన్నయ్య కలలు కన్నారు. అందుకోసం ఎంతో కష్టపడ్డారు అని పవన్ కళ్యాన్ తెలిపారు.

అవమానాలు

అవమానాలు

యాక్టర్ కావాలని నిశ్చయించుకున్న అన్నయ్య ఆ జర్నీలో ఎన్నో దెబ్బలు తిన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఎదగనివ్వలేదు

ఎదగనివ్వలేదు

మనం ఎదుగుతుంటే దాన్ని అడ్డుకునే వారు చాలా మంది ఉంటారు. అయినా ఎందుకు ఎదగనిస్తారు. అది మానవ నైజం. అన్నయ్య విషయంలోనూ అలా చాలా జరిగాయని పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు.

 నిరాశ పడలేదు

నిరాశ పడలేదు

తన ఎదుగుదలను అడ్డుకుంటూ అవమానాల పాలు చేస్తుంటే అన్నయ్య నిరాశ పడలేదు, వాటినన్నింటినీ ఎంతో కష్టపడి ఎదుర్కొని, అనుకున్నది సాధించారు.

ఆదే ఆయన మాకిచ్చిన లెగసీ

అన్నయ్య చిరంజీవి తనకు, ఫ్యామిలీకి ఇచ్చి లెగసీ ఏమిటో స్వయంగా పవన్ కళ్యాణ్ మాటల్లో ఈ వీడియో చూసి వీరే వినండి.

English summary
When a fan quizzed Pawan Kalyan about Chiranjeevi and what kind of legacy he has passed through for him and his family, Pawan spoke his heart out about his brother Chiranjeevi. Pawan Kalyan opined that, it is indeed great to have a dream like Chiranjeevi had, for a boy who is grown up in a very limited exposure. He explained that they use to live in a village and going to watch a movie was like a holiday for their family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu