»   » హాట్ టాపిక్ :రాజమౌళితో చేయలేనని చెప్పిన ప్రభాస్

హాట్ టాపిక్ :రాజమౌళితో చేయలేనని చెప్పిన ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ' ముందు రాజమౌళిగారితో నా ప్రయాణం గురించి చెప్పాలి. నా తొలి సినిమా తర్వాత ఆయనను రెండు మూడుసార్లు కలిశా. నాతో సినిమా చేసేందుకని కథ చెప్పారు. అప్పటికే విడుదలైన 'స్టూడెంట్‌నెం:1' చూశా. ఆ సినిమా పెద్ద హిట్టయింది కానీ ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. దీంతో మీతో నేను సినిమా చేయలేను సార్‌.. అన్నా అంటూ ప్రభాస్ చెప్పారు. 'బాహుబలి' ఆడియో వేడుక నిన్న తిరుపతిలో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఆ సందర్భంగా ప్రభాస్ ఇలా మాట్లాడారు. మీరూ స్వయంగా ప్రభాస్ ఏమన్నారో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు



ప్రభాస్ కంటిన్యూ చేస్తూ... అప్పటికి ఇంకా నా 'వర్షం' చిత్రీకరణ జరుగుతోంది. అదే సమయంలో 'సింహాద్రి' విడుదలైంది. తారక్‌ నన్ను ప్రివ్యూకి పిలిచాడు. ఆ సినిమా చూస్తుండగా నాకు పిచ్చెక్కిపోయింది. ఇతనేం దర్శకుడు రా బాబోయ్‌... అని ఆశ్చర్యపోయా.


'ఇలాంటి దర్శకుడితోనేనా నేను సినిమా చేయలేకపోయా. ఇక మేమిద్దరం కలిసి జీవితంలో సినిమా చేయలేమేమో' అనుకొన్నా. ఆ సమయంలోనే రాజమౌళిగారి దగ్గరికి వెళ్లి 'సింహాద్రి' చూశాను సర్‌.. బాగుంది' అన్నా. 'అవునా... మనం కలుద్దాం' అన్నారు.


ఆ తర్వాత ఓ హోటల్‌లో కలుసుకొన్నాం, మనం సినిమా చేద్దాం అన్నారు రాజమౌళిగారు. అప్పటికే నాకు ఫ్లాప్స్‌ ఉన్నాయి. 'నాకు సినిమా ఫ్లాప్స్‌, హిట్స్‌తో సంబంధం లేదు.. మనం సినిమా చేద్దామంతే' అన్నారాయన. 'ఛత్రపతి'తో మేం సన్నిహితులమైపోయాం.


When Prabhas rejected Rajamouli & hated Student No.1?

రాజమౌళిది ఒక రకమైన క్యారెక్టర్‌ అంతే. నా జీవితంలో 'బాహుబలి'లాంటి సినిమా చూడలేదు. ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుంది. అందుకే అడిగిన వెంటనే అంగీకరించా. రాజమౌళి నాతో ఇంత పెద్ద సినిమా చేస్తారని వూహించలేదు'' అన్నారు.


మే 31న జరగాల్సిన ఈ ఆడియో పంక్షన్ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో 'బాహుబలి' ఎదురుచూపులు కొనసాగాయి. ఎట్టకేలకు శనివారం సాయంత్రం తిరుమల తిరుపతి వేంకటేశుని సాక్షిగా, ఆయన సన్నిధి తిరుపతిలో పాటల పండుగు కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. అభిమానులంతా ఆనందోత్సాహాలతో ఈ పంక్షన్ ని ఎంజాయ్ చేసారు. ఈ నేఫధ్యంలో ప్రభాస్ ఇలా అన్నారు.


'బాహుబలి' గురించి ఎన్నో కబుర్లు బయటకు వచ్చాయి. 'బాహుబలి' కోసం మూడేళ్ల పాటు పాటుపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాపై పెదవి విప్పారు.

English summary
Prabhas said: " 'Student No.1' had already released by then but I really didn't like the film even though its a big hit. Please, don't take it in a wrong way! While I was shooting for 'Varsham', 'Simhadri' got released and I heard it's a biggest blockbuster. One fine day, Tarak invited me for the preview and I was spellbound watching it. I regretted missing an opportunity to work with Rajamouli and thought I won't get the chance again".
Please Wait while comments are loading...