»   » ప్రియాంక చోప్రా అతన్ని తన్నింది, తర్వాత ఏడ్చింది... కారణం?

ప్రియాంక చోప్రా అతన్ని తన్నింది, తర్వాత ఏడ్చింది... కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా షూటింగుల్లో అప్పుడప్పుడూ కొన్ని అనుకోని సంఘటనలు జరుగడం సహజమే. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో నటీనటులకు అనుకోని గాయాలు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వారు అనుకోకుండా ఎదుటి వారిని గాయపరుస్తూ ఉంటారు.

ప్రయాంక చోప్రా నటిస్తున్న ‘జై గంగాజల్' సినిమా చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇందులో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా తన సహచర నటుడు మానవ్ కాల్ మెడపై అనుకోకుండా తప్పింది ప్రియాంక. వాస్తవాని ఈ సీన్ చిత్రీకరణలో ఆమె అతన్ని చాతిపై ఎగిరి తన్నాలి.

 When Priyanka Chopra burst into tears

కానీ అనుకోకుండా అతని మెడపై బలంగా తన్నింది. దీంతో మానవ్ కాల్ అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే ఈ సంఘటన ప్రియాంక ఒక్కసారిగా షాకయింది. తన పొరపాటు వల్లే అతడు గాయపడటంతో ప్రియాంక కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రకాష్ ఝా ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారిణిగా నటించిన బాలీవుడ్ చిత్రం 'జై గంగాజల్‌'. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ చిత్రానికి స్వయంగా కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. 2003లో అజయ్‌ దేవగణ్‌ నటించిన గంగాజల్‌ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. మార్చి 4న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
During Jai Gangaajal fight sequences, Priyanka Chopra was supposed to hit the antagonist, played by Manav Kaul, in the movie. Accidentally, the actress hit Kaul’s throat. What was just an accident, mortified Priyanka and she cried inconsolably because she had hurt Manav.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu