దర్శకుడికి లంచం ఇచ్చి....సెక్సీలేడీతో ముద్దుసీన్!
చిన్నతనంలో మాధురి దీక్షిత్ సినిమాలు చూసి ఆమెపై అప్పట్లోనే మనసు పారేసుకున్న రణబీర్ కపూర్....ఇప్పుడు ఆమెతో కలిసి నటించే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అంతే కాదండోయ్....దర్శకుడికి లంచం ఇచ్చి మరీ ఇందులో ఆమె బుగ్గపై ముద్దు పెట్టే సన్నివేశానికి ప్లాన్ చేసాడట. ఈ విషయాన్ని రణబీర్ స్వయంగా వెల్లడించారు.
ఈ నెల 31న 'యే జవానీ హై యే దివానీ' చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు రణబీర్. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ 'ఆమె(మాధురి) నా మొదటి ప్రేమికురాలు, ఆమె పెళ్లి చేసుకోవడంతో నా గుండె పగిలిపోయింది. ఇప్పుడు ఆమెతో కలిసి పని చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో ఆమెను ముద్దు పెట్టుకునే చాన్స్ కోసం దర్శకుడికి నా స్టైల్‌లో లంచం ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రంలో 'ఘాగ్రా' అనే ఐటం సాంగులో మాధురి స్టెప్పులేసింది. ఈ పాటకు ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ కొయోగ్రాఫర్. ఆమె ఎంతో సిన్సియర్, అదే విధంగా పాషనేట్ మరియు టాలెంటెడ్. ఆమెతో కలిసి పని చేయడం ఎంతో గొప్ప అనుభూతి, ఆమె వండర్ ఫుల్ లేడీ... అంటూ తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయట పెట్టాడు రణబీర్.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే..ఎన్నో సినిమాల్లో రణబీర్ తండ్రి రిషి కపూర్ తో కలిసి నటించిన మాధురి దీక్షిత్ ఇప్పుడు రణబీర్ తో స్టెప్పులేయడం. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












