హీరోయిన్ బ్యాగులో అనుమాన్పద పొడి, పోలీసుల విచారణ!
న్యూ ఢిల్లీ: బాలీవుడ్ నటి రీచా చద్దాకు ఇటీవల న్యూ ఢిల్లీ విమానాశ్రయంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె బ్యాగులో అనుమానాస్పద ప్రదార్థాలు ఉండటంతో ఎయిర్ పోర్టు అధికారులు ఆమెను రెండు గంటల పాటు విచారించారు. అయితే చివరకు అయుర్వేద సౌందర్యసాధనాలు అని తేలడంతో వదిలి పెట్టారు.
అయితే రీచా చద్దాపై అధికారులకు అనుమానం కలగడానికి ఆమె ప్రవర్తనే అని తెలుస్తోంది. తొలుతు ఆ వస్తువులు ఉన్న బ్యాగును తెరిచి చూపెట్టాలని అధికారులు కోరగా ఆమె నిరాకరించారు. దీంతో వీరిలో అనుమానం మొదలైంది. చివరకు బలవంతంగా ఆమెతో బ్యాగు తెరిపించారు.

అయితే అందులో ఫౌడర్ లాంటి పదార్ధాలు ఉండటంతో.....అదేమిటో అర్థం కాక అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ మధ్య విమానాశ్రయాల ద్వారా వివిధ వస్తువులు, నిషేదిత పదార్థాల స్మగ్లింగ్ జోరుగా జరుగుతుండటంతో అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అందులో భాగంగానే వారు రీచా చద్దా వద్ద కనిపించిన అనుమానాస్పద ఫౌడర్ గురించి ప్రశ్నించారు.
ఈ సంఘటనపై రీచా చద్దా స్పందిస్తూ....ఆయుర్వేద వస్తువులపై నాకు నమ్మకం చాలా ఎక్కవ. ముంబైకి ఆయుర్వేద వస్తువులు తీసుకెళ్లడం అలవాటు. నా వస్తువులు ఓపెన్ చేసి భద్రతాధికారులు తనిఖీ చేయడం ఇష్టం లేదు. వాటిని నిలువ చేయడం చాలా కష్టపనైనందున తాను తొలుత నిరాకరించాను. రెండు గంటలపాటు అధికారులను ఒప్పించడానికి ప్రయత్నించాను. ఉపయోగం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తనిఖీలకు అంగీకరించానని రిచా చద్దా అన్నారు.


Click it and Unblock the Notifications











