»   » విశాల హృదయం: కూతురు బాయ్ ఫ్రెండుతో స్టార్‌హీరో

విశాల హృదయం: కూతురు బాయ్ ఫ్రెండుతో స్టార్‌హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమాల్లో హీరోలు బ్రాడ్ మైండెడ్(విశాల హృదయం)గా చేసే పనులు....నిజజీవితంలో చేయడానికి మాత్రం ఇష్ట పడరు. కానీ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ మాత్రం అలాకాదు. రియల్ లైఫ్ లోనూ ఆయన బ్రాడ్ మైండెడ్‌గానే ఉంటారు. ముఖ్యంగా తన పిల్లల విషయంలో. తన కూతురు సారాకు తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా మెలిగే సైఫ్ అలీఖాన్ ఇటీవల ఆమె బాయ్ ఫ్రెండ్‌ను కలిసాడు.

సారా, ఇబ్రహిం సైఫ్ అలీ ఖాన్, అతని మొదటి భార్య అమృత సింగ్‌లకు జన్మించిన సంగతి తెలిసిందే. 16 ఏళ్ల సారా ప్రస్తుతం ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో చదువుకుంటోంది. ఇందులో భాగంగా ఆమె తన పేరెంట్స్‌తో విడిగా ఉండాల్సిన పరిస్థితి.

తన కూతురు సారా గురించి సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ ఆమె బాయ్ ఫ్రెండును కూడా కలిసినట్లు చెప్పుకొచ్చాడు. 'నేను ఇటీవల సారా బాయ్ ఫ్రెండ్స్‌లో ఒకరిని కలిసాను. బోర్డింగ్ స్కూల్‌లో ఉండే పిల్లలు వారి సొంత జీవితం గురించి త్వరగా నేర్చుకుంటారు' అని సైఫ్ చెప్పుకొచ్చారు.

సారాతో కలిసి గడిపిన క్షణాలు మరిచిపోలేనివి. అయితే కొడుకు ఇబ్రహింతో కలిసి మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. అందుకు నేను ఎంతో బ్యాడ్‌గా ఫీలవుతున్నాను అని సైఫ్ అలీఖాన్ అన్నారు. ఇక తన రెండో భార్య కరీనాతో కలిసి ఫ్యామిలీని ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు? అన్న ప్రశ్నకు సైఫ్ స్పందిస్తూ...ప్రస్తుతం ఇద్దరం ప్రొఫెషనల్‌గా బిజీగా ఉన్నాం. పిల్లలు కనే విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదు అన్నారు.

English summary
Like in his movies, actor Saif Ali Khan is known for his advanced and cool thoughts. Unlike other fathers, Saif is more a modern and broad-minded dad, who prefers to give total space to his growing kids- Sara Ali Khan and Ibrahim.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu