సైఫ్-కరీనా లగ్గం ఎప్పుడంటే...
బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్....మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తరచూ అభిమానులను ఊరిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ల పెళ్లి ఎప్పుడు జరుగుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సైఫ్ తో పాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఆయన చెల్లెలు సోహా అలీఖాన్ కూడా పెళ్లి ఫిబ్రవరిలో ఉండొచ్చని గతంలోనే ప్రకటించారు కూడా. దీంతో ఫిబ్రవరి లో సైప్-కరీనా పెళ్లి అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు మీడియా వారు.
అయితే ఈ వార్తలపై కరీనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, మీడియా వారు అత్యుత్సాహం తగ్గిస్తే మంచిది అంటూ...చిర్రుబుర్రులాడింది. సైఫ్, సోహా చెప్పారు కాబట్టే మేము అలా ప్రచారం చేయాల్సి వచ్చిందని మీడియా వారు ఎంత మొత్తుకున్నా వినిపించుకునే పరిస్థితుల్లో లేదు కరీనా.
తాజాగా మరోసారి సైఫ్ చెల్లెలు సోహా అలీఖాన్ స్పదించారు. మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ...మార్చి 2012లో సైఫ్-కరీనా పెళ్లి జరిగే అవకాశం ఉందని చెప్పకొచ్చారని తెలిసింది. మరి సోహా చెప్పినదాంట్లో నిజం ఎంత? మరి దీనిపై కరీనా ఎలా స్పందించబోతోందో? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











