సంజయ్‌దత్ ఇంటికెళ్లి పరామర్శించిన స్టార్ హీరో
ముంబై : తన సన్నిహిత మిత్రుడు సంజయ్ దత్ ని ఇంటికెళ్లి సల్మా న్ ఖాన్ పరామర్శించారు. అమెరికాలో వైద్యపరీక్షలు చేయించుకుని తిరిగొచ్చిన సల్మాన్‌ఖాన్, ముంబాయి చేరుకోగానే సంజయ్‌దత్ ఇంటికి వెళ్ళి కలిసి కాసేపు మాట్లాడారు. ముంబాయి పేలుళ్ళకేసులో సుప్రీమ్‌కోర్ట్ సంజయ్‌దత్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష విధించిననాటినుంచి బాలీవుడ్ ప్రముఖులు పాలిహిల్ ప్రాంతంలో ఉన్న అతని ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తీర్పు వెలువరించిన సమయంలో అమెరికాలో ఉన్న సల్మాన్, తిరిగి రాగానే సంజయ్‌ను కలుసుకున్నారు. సంజయ్‌ను, అతని భార్య మాన్యతకు ధైర్యం చెప్పారు.
సంజయ్‌దత్‌పై సుప్రీమ్‌కోర్ట్ ఇచ్చిన తీర్పుపై తాను కలత చెందానని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పారు. ఆయన తనకు మంచి మిత్రుడని, ఎంతో మంచి మనిషని రజనీ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే దత్‌కు లభిస్తున్న మద్దతు, క్షమాభిక్ష అభ్యర్ధనపై తాను ఆశాభావంతో ఉన్నానని వెల్లడించారు. ఆయనకు పరిష్కారం లభించాలని, మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని తాను భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. దత్, ఇటీవల తన సినిమా పోలీస్‌గిరి షూటింగ్ సందర్భంగా చెన్నైలో రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.
ఇక సంజయ్ దత్‌ను ఎర్రవాడ జైలుకు తరలించవచ్చని తెలుస్తోంది. 1993 ముంబయి సీరియల్ పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు అతడిపై నేరనిర్ధారణ చేసింది. 2006లో టాడా కోర్టు విధించిన ఆరేళ్ల జైలును సుప్రీం కోర్టు ఐదేళ్లకు తగ్గించింది. జైలు అధికారులతో చర్చలు నిర్వహించి అతడిని ఎప్పుడు జై లులో పెట్టాలా అనేది నిర్ణయిస్తామని మహారాష్ట్ర డిజిపి మీరన్ ఛాదా బోర్వాంకర్ విలేఖరులకు చెప్పారు. తమ జైలు సురక్షితమని శిక్షలు పడిన పలువురు ప్రముఖులు గతంలో ఇక్కడే జైలు అనుభవించారని ఎర్రవాడ జైలు అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications











