రజనీకాంత్ ను కలిసిన సంజయ్‌ దత్‌

By Srikanya

చెన్నై: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ చెన్నైలో తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను కలుసుకున్నారు. సంజయ్ దత్‌, 'పోలీస్‌గిరి' అనే సినిమా షూటింగ్‌కోసం చెన్నైలో ఉన్న సంగతి తెలుసుకున్న రజనీ, అతనిని, ఆ సినిమా దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. రజనీ ఆహ్వానాన్ని మన్నించి దత్‌, దర్శకుడు రవికుమార్‌తో కలిసి ఆయన ఇంటికి వెళ్ళారు. ఈ భేటీపై సంజయ్‌దత్‌ ఎంతో సంతోషాన్ని వ్యక్తంచేశారు. రజనీకాంత్‌కు సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌తో, ఆయన కుటుంబంతో చాలాకాలంనుంచి మంచి అనుబంధం ఉందని కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.

కోర్టు వివాదాలు.. వ్యక్తిగత ఇబ్బందులు... 1990 దశకం మధ్యకాలం నుంచి బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ జీవితంలో దాదాపుగా ఒక భాగమైపోయాయి. జీవితంలో ఎగుడు దిగుడులనేవి మంచి నటుడిగా మారటానికి తనకెంతో ఉపకరించాయని సంజయ్‌దత్‌ చెప్పుకొచ్చాడు. అన్ని రకాల పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే 'మున్నాభాయ్‌' తెరపై నటించటానికి తానేంతో ఇష్టపడే యాక్షన్‌ హీరో పాత్రలో మరోసారి అభిమానుల ముందుకు వస్తున్నాడు. సమీప కాలంలో దర్శకత్వం చేపట్టడం ద్వారా తన పరిధిని మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సంజూ భాయ్‌ తెలిపాడు.

''యాక్షన్‌ హీరో పొందే స్టార్‌డమ్‌ అతడిని ఎక్కడికో తీసుకువెళుతుంది. అది అంత తేలిగ్గా వచ్చేది కాదు. ఒక్కసారి దక్షిణాది సినీపరిశ్రమ వైపు మీరు చూసిన పక్షంలో రజనీ సాబ్‌(రజనీకాంత్‌), సూర్య లాంటి హీరోలకు అభిమానులు పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తుంటారు. వారికున్న యాక్షన్‌ ఇమేజ్‌ అందుకు కారణం'' అని సంజయ్‌ వివరించాడు. 'సడక్‌', 'యాల్‌గార్‌', 'ఖల్‌నాయక్‌', 'క్షత్రియ', 'కురుక్షేత్ర', 'వాస్తవ్‌', 'షూటవుట్‌ ఎట్‌ లోఖండ్‌వాలా' లాంటి యాక్షన్‌ చిత్రాల్లో అతడు నటించిన సంగతి తెలిసిందే.

యాక్షన్‌ హీరోగా సంజయ్‌ దత్‌ విశ్వరూపాన్ని త్వరలో విడుదల కానున్న 'జిల్లా ఘజియాబాద్‌' చిత్రాల్లో చూడవచ్చు. భవిష్యత్తులో అతడు దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టవచ్చు. ''మరో ఐదు సంవత్సరాల తర్వాత నేను ఒక సినిమాకు దర్శకత్వం వహించవచ్చు. కానీ అది పూర్తి కమర్షియల్‌ యాక్షన్‌ చిత్రంగా ఉంటుందని మాత్రం నేను గట్టిగా చెప్పగలను'' అని సంజయ్‌ నవ్వుతూ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X