twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు ప్రజలది కూడా.. ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పుడే చెప్పను: మీడియాతో రాజమౌళి చిట్ చాట్

    |

    హార్వర్డ్ యూనివర్శిటీ కాన్ఫరెన్సులో పాల్గొనడం, ఇక్కడ ప్రసంగించి అవకాశం దక్కడం ఆనందంగా ఉంది, గౌరవంగా భావిస్తున్నట్లు దర్శకు రాజమౌళి అన్నారు. అనంతరం అయన తెలుగు మీడియాతో మెచ్చటించారు.

    శాంతి నివాసం సీరియల్‌తో నా ప్రయాణం మొదలైనపుడు ఈ స్థాయికి వస్తానని కల కనలేదు. చేసిన ప్రతి సినిమాపై ది బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టడం, సినిమా ఐడియాను బెస్ట్ ప్రొడక్ట్ గా మార్చుకోవడానికి ఎంత కష్టపడాలి అని ఆలోచించుకుంటూ వచ్చాను. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలా అని ఇది గ్రేట్ లెవల్ అనుకోను. బిగినింగుతో పోల్చుకుంటే ఇపుడు మంచి స్థాయిలో ఉన్నామని భావిస్తానని రాజమౌళి వ్యాఖ్యానించారు.

    మీ నుంచి ఇంటర్నేషనల్ సినిమా ఎప్పుడు వస్తుంది?

    మీ నుంచి ఇంటర్నేషనల్ సినిమా ఎప్పుడు వస్తుంది?

    బాహుబలితో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యారు.. మీ నుంచి ఇంటర్నేషనల్ మూవీ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు? అనే ప్రశ్నకు స్పందిస్తూ... ఇంటర్నేషనల్ మూవీ అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఏ సినిమా అయినా, ఏ బాషా చిత్రం అయినా బాగా తీస్తే ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన పద్దతులు ఉంటాయి. నా వరకు నేను మన ఇండియన్ స్టోరీస్, మనకు తెలిసిన కథలను, అందులోని ఎమోషన్స్ ను ఎంత బాగా తీయగలమనే దానిపైనే దృష్టిపెడతాను. ముందు మన సినిమాను అందంగా, మనం అనుకున్న విధంగా తీయగలిగితే అది ప్రపంచ ప్రేక్షకలకు నచ్చుతుంది. బాహుబలి సినిమా జపాన్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిందేమీ కాదు. కానీ అక్కడ మంచి ఫలితాలు సాధించిందని రాజమౌళి అన్నారు.

    తప్పు ప్రజలది కూడా...

    తప్పు ప్రజలది కూడా...

    గతంలో జేపీగారి వెనక తిగినపుడు... ఒక ఐడియా ఉండేది. ప్రజలంతా మంచివారు, పొలిటీషియన్స్ అంతా చెడ్డవారు. మంచి పొలిటీషియన్స్ ను ఎన్నుకుంటే మొత్తం అంతా మారిపోతుంది అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది పొలిటీషియన్స్ అంతా చెడ్డవారు కాదు. ఇప్పుడున్న పరిస్థితులకు పొలిటీషియన్స్ ఎంత బాధ్యులో, ప్రజలు కూడా అంతే బాధ్యులు. డబ్బులు తీసుకుని ఓటేసినపుడు మనం పొలిటీషియన్లను బ్లేమ్ చేయడానికి ఏమీ ఉండదు. అదొక్కటనే కాదు చాలా కారణాలు ఉన్నాయని రాజమౌళి తెలిపారు.

    ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పుడే చెప్పను

    ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పుడే చెప్పను

    ఆర్ఆర్ఆర్ గురించి ఏ విషయం కూడా బయటకు రాలేదు. మా కోసం ఏమైనా చెప్పండి...అని మీడియా వారు అడగ్గా రాజమౌళి నిరాకరించారు. ఒక్కో సినిమా విషయంలో ఒక్కో విధానం ఉంటుంది. బాహుబలి స్టోరీ నేను ముందే ఏమీ చెప్పలేదు. మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు కథ ముందే చెప్పాను. ఆర్ఆర్ఆర్ గురించి అన్ని విషయాలు దాయాలని ఏమీ కాదు, సీక్రెట్ గా పెట్టాలని ఏమీ కాదు. ఇది సరైన సమయం కాదు. ఆ సమయం వచ్చినపుడు దాని గురించి అన్ని విషయాలు చెబుతానన్నారు.

    అవన్నీ సినిమా తీసేపుడు ఆలోచించడం కుదరదు

    అవన్నీ సినిమా తీసేపుడు ఆలోచించడం కుదరదు

    నేను ఏ సినిమా చేసినా హ్యూమన్ ఎమోషన్స్ బేస్ చేసుకుని చేస్తాను. హ్యూమన్ ఎమోషన్స్ అనేవి అందరికీ ఒకేలా ఉంటాయి. ఇండియన్స్, జపనీస్, చైనాస్ అందరి ఎమోషన్స్ ఒకేలా ఉంటాయి. మనం దాన్ని ఎంత అందంగా చెబుతామనన్న దాన్ని బట్టి గుడ్ ప్రొడక్ట్ వస్తుంది. ఆ గుడ్ ప్రొడక్ట్ ఇండియన్స్ ను దృష్టిలో పెట్టుకునే తీస్తాం. అయితే ఇండియా బయట అది ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది కచ్చితంగా చెప్పలేం. అక్కడ వారికి సినిమా కనెక్ట్ అవ్వాలంటే ముందు అక్కడ రిలీజ్ అవ్వాలి. సినిమా తీసేపుడు అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే సినిమా ముందుకు సాగదు. మనం ముందు మన ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయాలి. అది తయారైన తర్వాత దాన్ని ఎంత మంది జనాలకు రీచ్ చేయాలి అనేది ఆలోచించాలి.

    అలాంటి వాటి వల్ల నిర్మాతలకు లాభమే

    అలాంటి వాటి వల్ల నిర్మాతలకు లాభమే

    ‘ఎఫ్ 2' లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ విడుదలైన నెల రోజులకే అమేజాన్ ప్రైమ్ లాంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో అందుబాటులోకి వస్తోంది. ఇది తెలుగు సినిమాకు మంచిదేనా? అనే ప్రశ్నకు రాజమౌళి స్పందస్తూ.. గతంలో మనకు థియేటర్ల ద్వారా మాత్రమే రెవెన్యూ వచ్చేది. తర్వాత శాటిలైట్ రైట్స్ అమ్మడం ద్వారా అదనపు రెవెన్యూ వస్తోంది. ఇపుడు ఆన్ లైన్ స్ట్రీమింగ్ రావడం వల్ల నిర్మాతలకు ఆదాయం ఇంకా పెరిగింది. ఇలాంటి వాటి వల్ల నిర్మాతలకు మంచిదే. అయితే వీటిలో సినిమాలు రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్ల వరకు ఎందుకు వెళ్లాలని ఆలోచన చేస్తాడని అనుకోవడం లేదు. థియేటర్లకు ఇవి కాంపిటీషన్ కావచ్చేమో? కానీ థియేటర్లో బెస్ట్‌ఎక్స్ పీరియన్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తే ప్రేక్షకులు వస్తారు అని రాజమౌళి అభిప్రాయ పడ్డారు.

    కీరవాణి మాత్రమే ఎందుకంటే...

    కీరవాణి మాత్రమే ఎందుకంటే...

    ఏ డైరెక్టర్ అయినా తన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంచుకున్నారంటే అతడితో తన కంఫర్ట్ లెవల్స్ చూసుకుంటాడు. నేను కీరవాణి గారితో మాత్రమే చేయడానికి కారణం ఆయనతో నా కంఫర్ట్ లెవల్స్, నాకు కావాల్సింది ఇస్తారనే నమ్మకం. నాకు కావాల్సిన కంఫర్ట్ దొరికితే ఫ్యూచర్లో ఇతర సంగీత దర్శకులతో కూడా చేసే అవకాశం ఉందని రాజమౌళి తెలిపారు.

    English summary
    "When the time comes, I will reveal all the details of RRR" Director SS Rajamouli said. RRR is an upcoming Telugu period action film film scripted and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr. and Ram Charan in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X