Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఆటోనగర్ సూర్య' కొనసాగుతున్న అనిశ్చితి
హైదరాబాద్ : నాగచైతన్య, సమంత జంటగా రూపొందుతోన్న 'ఆటోనగర్ సూర్య' చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ' ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె. అచ్చిరెడ్డి నిర్మాత. వెన్నెల', 'ప్రస్థానం' చిత్రాలతో అందరి ప్రశంసలూ పొందిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకుడు.
'ఏమాయ చేశావే' తర్వాత నాగచైతన్య, సమంత కాంబినేషన్లో తయారవుతున్నందున ఈ సినిమాపై సినీ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైనా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో అనిశ్చితి నెలకొని ఉంది. ఆ అనిశ్చితి తొలగి త్వరలోనే 'ఆటోగనర్ సూర్య' ప్రేక్షకుల ముందుకు వస్తాడని అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో నాగచైతన్య స్కిల్ డ్ మెకానిక్ గా కనిపించనున్నారు. నాగాచైతన్య పాత్ర గురించి వివరిస్తూ... "చైతూ ఈ చిత్రంలో స్కిలెడ్ మెకానిక్ గా కనిపించనున్నారు. పూర్తిగా హీరో సెంట్రిక్ స్క్రిప్టు ఇది. ప్రస్దానం కన్నా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అన్నారు. ఇక దేవకట్టాకు డైలాగ్స్ విషయంలో మంచి గ్రిప్ ఉందని గతంలో ప్రస్దానం నిరూపించింది. ఆ చిత్రంలో లోతైన భావమున్న డైలాగులుకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ చిత్రకు మొదట ఆడియో టీజర్ విడుదల చేసి మరీ క్రేజ్ క్రియేట్ చేసారు" అన్నారు.
ఇక ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే... విజయవాడలో బెంజ్ సర్కిల్ ఎంత ఫేమసో... ఆటోనగర్ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే 'ఆటోనగర్ సూర్య' చిత్రం చూడాల్సిందే.
ఈ చిత్రంలో సాయికుమార్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.