డిప్రెస్ అయినప్పుడు అది చేస్తేనే రిలాక్స్...అనుష్క
నేను డిప్రెస్ బాగా అయిన సందర్భాలు ఉన్నాయి. ఆ సిట్యువేషన్ నుంచి తప్పించుకోవటానికి నేను సామెతలు, సూక్తులు(కోట్స్) చదువుతూంటాను. అలాగే ఆ సమయాల్లో ఒంటిరిగా ఒక్కదాన్నే రూమ్ లో ఉండిపోతాను. నేను ఒంటరితనాన్ని ఇష్టపడతాను. ఓ నలభై నిముషాల పాటు కార్డియో ఎక్సర్ సైజ్ లు యోగా చేసుకుంటాను. ఇక నా ఫిట్ నెస్ స్టైల్ ఏమిటంటే రోజూ రాత్రి ఎనిమిది దాటాక ఏమీ తినను. ఎనిమిది అయ్యేలోగా నా డిన్నర్ పూర్తి చేసుకుంటాను అంది. అలాగే నేను ఖాలీగా ఉన్నప్పుడు నా నేటివ్ ప్లేస్ బెంగుళూరు వెళ్ళి అక్కడున్న నా రెస్టారెంట్ రన్ చేసుకుంటాను అని చెప్తోంది. ప్రస్తుతం అనుష్క..మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. అలాగే రవితేజ సరసన డాన్ శీను చిత్రంలో చేస్తోంది. భూమిక నిర్మిస్తున్న తకిట తకిట చిత్రంలో గెస్ట్ గా చేస్తోంది. రీసెంట్ గా రిలీజైన క్రిష్ వేదం చిత్రంలో వేశ్య పాత్రను చేసి మంచి పేరు సంపాదించుకుంది. వీటికి తోడు నాగార్జున సరసన వీరూ పోట్ల చిత్రంలో చేస్తోంది. ఆమె నటించిన సింగం చిత్రం డబ్బింగ్ యముడు రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











