రవితేజకు వర్మ హ్యాండ్ ఇచ్చినట్లేనా?
దొంగలముఠా లో వచ్చిన లాభాలని పంచుతామని రిలీజ్ కు ముందు ఊదరకొట్టిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత దాని ఊసే ఎత్తటం లేదు.ఛార్మి,రవితేజ తమ ఇమేజ్ లను ఫణంగా పెట్టి ఈ చిత్రంలో చేసారు.వారికీ దారి ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదని టాక్.ఇక నిర్మాత కిరణ్ కుమార్ ని వారి మేనేజర్స్ అడిగితే ..లాభాలు వస్తే ఇస్తామన్నాం.ఎంత వచ్చాయో మీకు తెలుసుకదా అని తేల్చేసాడుట.
మరో ప్రక్క రవితేజ ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా షార్ట్ ఫిలిం చేసుకు వచ్చినవారికి దర్శకుడుగా ఆఫర్ ఇస్తానని ప్రకటించాడు.వారు ఓ ప్రక్క తిరగటం ప్రారంభించారు.ఛార్మి ఎలాగో ప్లాఫ్ లలో ఉందికాబట్టి పదిలో ఇది ఒకటి అని సర్ది చెప్పుకుందిట.సుబ్బరాజు,బ్రహ్మానందం,మంచులక్ష్మీ,బ్రహ్మాజి,సుప్రీత్ వంటి వారు ఎవరిని అడగాలి.అడిగితే తర్వాత వర్మ తను చేసే చిత్రాలలో మనల్ని ప్రక్కన పెడతాడేమో అన్నట్లు ఆలోచనలో పడి విరమించుకున్నారట.ఇలా ఎవరికి వారు సైలెంట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











