వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో హ్యాపీడేస్ ప్రధాన పాత్రలో ఒకరైన టైసన్ ని హీరోగా పెట్టి రెయిన్ బొ అనే చిత్రాన్ని తీసారు. అలాగే ఈ చిత్రాన్ని 70 లక్షలకు శాటిలైట్ రైట్స్ అమ్మానని ఆయనే మీడియాకు తెలియ చేసారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేటు ముందుకు రావటం లేదు. నిర్మాణం పూర్తయి నాలుగు నెలలైనా సినిమాని తీసుకోవటానికి బయ్యర్లు ముందుకు రాకపోవటం నిర్మాతలను చాలా భయపెడుతోందని తెలుస్తోంది. అందులోనూ గతంలో మనసంతా నువ్వే,నేనున్నాను,ఆట వంటి చిత్రాలు తీసిన దర్శకుడు చిత్రం పరిస్దితే ఇలా ఉంటే ఊరూపేరూ లేని కొత్త దర్శకులతో సినిమాలు ప్రారంభిస్తున్నాం ఎలా అన్నది చాలా మంది ఆలోచనట. ఏదైమైనా భారీ డెఫిషిట్ తోనే ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ సినిమా హాంకాంగ్ రొమాంటిక్ కామిడీ పరపర సుకురో అనే సినిమా ఆధారంగా తీసారని సమాచారం.