ఇంతకీ నా నేటివ్ ప్లేస్ ఏదో చెప్పండి?: ఎస్ ఎస్ రాజమౌళి
తన నేటివ్ ప్లేస్ గురించి రాజమౌళి తాజాగా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ...నేను రాయచూర్ జిల్లా కర్ణాటకలో పుట్టాను. పశ్చమ గోదావరి జిల్లాలో చదువుకున్నాను. చెన్నైలో పనిచేసాను..హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. కాబట్టి మీరే నా నేటివ్ ప్లేస్ నిర్ణయించండి అన్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి...ఈగ చిత్రం పనిలో బిజీగా ఉన్నారు.
అలాగే ఆ మద్య ఈ ఈగ చిత్రం గురించి చెబుతూ.."నా తదుపరి చిత్రం ఆర్.కె.ప్రొడక్షన్స్‌లో ప్రభాస్‌తో చేస్తాను. అయితే ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ఈలోగా 'ఈగ' అనే ప్రయోగాత్మక చిత్రం చేద్దామా? వద్దా? అనే సంశయంలో ఉన్నాను. మహేష్ బాబుతో కథా చర్చలు జరిగాయి. నాగార్జునతో నాన్నగారు ఒక సినిమా రూపొందిస్తున్నారు. ఆ సినిమాలో యాక్షన్ ఘట్టాల్ని నేను తెరకెక్కిస్తాను" అన్నారు.
ఇక ఇక 'ఈగ' చిత్రంలో హీరో ఉండరని ఎగిరే ఈగ ప్రధాన పాత్ర వహిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు గత కొంతకాలంగా స్క్రిప్టు వర్క్ నడుస్తోంది. పూర్తి స్ధాయి గ్రాఫిక్స్ తో కూడిన ఓ ప్రయోగాత్మక చిత్రంగా ఈ 'ఈగ' ని తీర్చిదిద్దాలని రాజమౌళి భావిస్తున్నారు. ఈగ' మాత్రమే గ్రాఫిక్స్ అనీ మిగతా పాత్రల్లో మనుష్యులు ఉండనున్నారని చెప్తున్నారు. ఇక కథ మొత్తం 'ఈగ' పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. అలాగే రాజమౌళి ..హెచ్ ఎమ్ టీవీ కోసం..కమాన్ ఇండియా అనే పోగ్రాంని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











