twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ లుక్ చూస్తే దడుచుకోవడం ఖాయం (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ త్వరలో 'బాబీ జాసోస్' అనే హిందీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో విద్యా బాలన్ డిటెక్టివ్ పాత్ర పోషిస్తోంది. ఇందుకోసం సినిమాలో రకరకాల మారు వేషాలు వేయాల్సి వచ్చింది. అసలు మనం ఆమెను గుర్తించలేనంతగా ఈ మారు వేషాలు ఉన్నాయి.

    సినిమా కోసం 122 గెటప్‌లు టెస్ట్ చేసారు. చివరగా 12 బెస్ట్ గెటప్‌లను ఎంపిక చేసారు. వివిధ గెటప్స్ వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉందని, పుచ్చుపళ్లతో ఉన్న జ్యోతిష్యుడి వేషం కూడా తాను వేసానని, డిఫరెంటు లుక్‌తో ఎవరూ గుర్తు పట్టని విధంగా తన మారు వేషాలు ఉన్నాయని విద్యా బాలన్ తెలిపారు.

    అలాంటి గెటప్స్ వేసిన సమయంలో తన బాడీలాంగ్వేజ్, వాయిస్ కూడా ఆటో మేటిక్‌గా మారి పోయిందని, చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాలో నటించానని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని విద్యా బాలన్ చెప్పుకొచ్చారు. ఈచిత్రానికి సమర్ షేక్ దర్శకత్వం వహిస్తున్నారు. మే 27న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేసారు. జులై 4వ తేదీన సినిమా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో విద్యా బాలన్ వేసిన డిఫరెంట్ లుక్స్ స్లైడ్ షోలో....

    జ్యోతిష్యుడి పాత్రలో విద్యా బాలన్

    జ్యోతిష్యుడి పాత్రలో విద్యా బాలన్

    బట్టతల, పుచ్చు పళ్లతో కూడిన జ్యోతిష్యుడి వేషధారణలో విద్యా బాలన్ ఇలా సినిమాలో కనిపించబోతోంది. ఎంతో అందంగా ఉండే విద్యా బాలన్‌ను ఈ లుక్‌లో చూస్తే అభిమానులు ఎలా స్పందిస్తారో..?

    ఆటో వాలా పాత్రలో...

    ఆటో వాలా పాత్రలో...

    టోపోరీ ఆటో వాలా పాత్రలో విద్యా బాలన్ ఇలా. పాత్రకు తగిన విధంగా విద్యా బాలన్ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించింది.

    ముస్లిం లేడీగా...

    ముస్లిం లేడీగా...

    ముస్లిం లేడీ పాత్రలో బురఖా ధరించి విద్యా బాలన్ ఇలా సినిమాలో కనిపించబోతోంది.

    ఎత్తు పళ్ల అమ్మాయి....

    ఎత్తు పళ్ల అమ్మాయి....

    ఎత్తుపళ్ల అమ్మాయి పాత్రలో విద్యా బాలన్ లుక్ ఎలా ఉంది. చాలా చాలా చాలా అందంగా ఉంది కదూ!

    ఓల్డ్ ముస్లిం మ్యాన్ పాత్రలో...

    ఓల్డ్ ముస్లిం మ్యాన్ పాత్రలో...

    విద్యా బాలన్ ఇలా ఓల్డ్ ముస్లిం మ్యాన్ పాత్రలో కూడా ఈ చిత్రంలో కనిపించబోతోంది.

    బెగ్గర్ పాత్రలో...

    బెగ్గర్ పాత్రలో...

    బెగ్గర్ పాత్రలో విద్యా బాలన్ ఇలా. డిటెక్టివ్‌గా రహస్యాలను చేధించే క్రమంలో విద్యా బాలన్ ఇలా మారు వేషాల్లో సంచరిస్తూ ఉంటుంది.

    హెవీ వెయిట్ లేడీ

    హెవీ వెయిట్ లేడీ

    హెవీ వెయిట్ లేడీ పాత్రలో విద్యా బాలన్ ఇలా. ఎంతో నాజూకుగా ఉండే విద్యా బాలన్‌ను ఇంత భారీ ఆకారంలో చూసి అభిమానులు తట్టుకుంటారా?

    మరో డిఫరెంట్ అవతార్

    మరో డిఫరెంట్ అవతార్

    మరో డిఫరెంట్ అవతారంలో...విద్యా బాలన్ ఇలా.

    English summary
    Bollywood actress Vidya Balan who is all set with her upcoming flick Bobby Jasoos plays the role of a female detective in the film. While, Vidya actually gave 122 test looks for the movie Bobby Jasoos and finally chose 12 best suitable disguises from those, the actress says that she enjoyed being in disguise of a man most, especially the half bald astrologer with dirty teeth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X