మారుతున్న సంక్రాంతి సినిమాల లెక్కలు.. అత్యధికంగా ఆ సినిమా టికెట్ల అమ్మకం.. దేనికి తక్కువగా వచ్చాయంటే?
సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం ఆరు సినిమాలు విడుదల అయ్యాయి. ఈక్రమలోనే సినీ ప్రియులు అందరూ తమకు నచ్చిన సినిమాలు చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. తమ అభిమాన హీరో, లేకపోతే పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను ఫ్యామిలీతో కలిసి వీక్షించేందుకు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో.. అంటే జనవరి 17వ తేదీ ఉదయం నుంచి జనవరి 18వ తేదీ ఉదయం వరకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి.. ఏ సినిమాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గడిచిన 24 గంటల్లలో బుక్ మై షోలో ఎక్కువగా బుక్ అయిన టికెట్లు, ఏయే సినిమాల టికెట్లు అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఎప్పటిలాగే తేజా సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమా చూసేందుకు చాలా మందికి టికెట్లు కూడా దొరకడం లేదు. ఆన్ లైన్ లోకి టికెట్లు ఇలా రాగానే అలా అయిపోతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే టికెట్లను బుక్ చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్లే ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 229.06కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే 2 లక్షల 29 వేల 60 టికెట్లు అమ్ముడు పోయాయి.

ఇక టాప్ 2లో మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం నిలిచింది. గత సినిమా విడుదల అయిన మొదటి రోజు తప్ప ఆ తర్వాత రోజుల్లో ఈ సినిమా రెండో స్థానానికే పరిమితం అయింది. గత 24 గంటల్లో ఈ సినిమాను చూసేందుకు 69.71కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే 69 వేల 710 మంది బుక్ మై షో ద్వారా ఈ సినిమాను చూడనున్నారు. అలాగే శివకార్తికేయన్ హీరోగా చేసిన అయలాన్ సినిమా మూడో స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు కూడా చాలా మందే ఆసక్తి కనబరుస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 61.91కే మంది ఒక్క బుక్ మై షో ద్వారానే టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే 61 వేల 910 మంది ఈ సినిమాను చూడనున్నారు.
ఇక ఎవరూ ఊహించని విధంగా నాలుగో స్థానంలో నాగార్జున హీరోగా చేసిన నా సామి రంగా నిలిచింది. మొన్నటి వరకు అన్నిటి కంటే తక్కువ టికెట్లు పొందిన ఈ సినిమా ఇప్పుడు టాప్ 4లోకి రావడం గమనార్హం. సినిమా కథ బాగుండడంతో సినిమాను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే ఈ సినిమా కోసం 40.16కే టికెట్లు అమ్ముడు పోయాయి. గడిచిన 24 గంటల్లోనే 40 వేల 160 టికెట్లను సినీ ప్రియులు బుక్ చేసుకున్నారు.
ఇక ధనుష్ హీరోగా చేసిన కెప్టెన్ మిల్లర్ సినిమా ఐదో స్థానంలో నిలిచింది. గత 24 గంటల్లో కెప్టెన్ మిల్లర్ కు చెందిన 28.94కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే 28 వేల 640 మంది ఈ సినిమా చూడాలని టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇక విక్టరీ వెంకటేషన్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమా చివరి స్థానంలో నిలిచింది. అన్ని చిత్రాల కంటే ఈ సినిమా చూసేందుకు చాలా తక్కువ మంది టికెట్లు బుక్ చేసుకున్నారు.మొత్తం 17.35కే అంటే 17 వేల 350 మంది ఈ సినిమాను చూడాలని టికెట్లు బుక్ చేసుకున్నారు. నా సామి రంగాకు మెల్లి మళ్లిగా క్రేజ్ పెరుగుతుండగా.. సైంధవ్ కుమాత్రం తగ్గిపోయింది. అలాగే హనుమాన్ జోరు కొనసాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











