రాంచరణా.. మజాకా.. ఒకేసారి నాలుగు, ఇంత ఒత్తిడిలో ఎలా సాధ్యం!

Recommended Video

How It Is Possible To Ram Charan ? | Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. రంగస్థలం భారీ హిట్ తరువాత రాంచరణ్ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. అభిమానుల అభిరుచికి అనుగుణంగానే చరణ్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ధృవ లాంటి అద్భుత చిత్రంతో రూటు మార్చిన చరణ్ కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా గడుపుతున్నది రాంచరణే.

ఒకేసారి నాలుగు

ఒకేసారి నాలుగు

రంగస్థలం చిత్రంతో చరణ్ కెరీర్ లో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. అంతటితో చరణ్ రిలాక్స్ అయిపోలేదు. రాంచరణ్ ప్రస్తుతం పనిచేస్తున్న విధానం చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ కి గురవుతున్నాయి. నటుడిగా, నిర్మాతగా చరణ్ ఒకేసారి నాలుగు చిత్రాలకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఆషామాషీ చిత్రాలు కాదు. వందల కోట్ల బిజినెస్ జరిగే చిత్రాలు కావడం విశేషం.

నటుడిగా, నిర్మాతగా

నటుడిగా, నిర్మాతగా

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ వినయ విధేయ రామ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో కూడా చరణ్ పాల్గొంటున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి రాంచరణ్ నిర్మాత. సైరా తరువాత కొరటాల దర్శత్వంలో చిరు నటించబోయే చిత్రానికి కూడా చరణే నిర్మాత అని వార్తలు వస్తున్నాయి. ఏ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైందట.

వత్తిడిని జయిస్తూ

వత్తిడిని జయిస్తూ


ఇలా నాలుగు బడా చిత్రాలకు ఒకేసారి రాంచరణ్ పనిచేస్తున్నాడు. ఒత్తిడిని అలవోకగా జయిస్తూ చాలా కూల్ గా తనపని తాను చేసుకుపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చరణ్ వర్క్ మేనేజ్ మెంట్ కు అంతా ఫిదా అవుతున్నారు. నటుడిగా రాణిస్తూనే సినిమా నిర్మాణంలో రాంచరణ్ అద్భుతమైన పరిణితి కనబరుస్తున్నాడని అంటున్నారు.

సంక్రాంతి బరిలో

సంక్రాంతి బరిలో


బోయపాటి దర్శత్వంలో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ తో కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ రెండు చిత్రాలకు డివివి దానయ్య నిర్మాత. ఇక నిర్మాతగా వ్యవహరిస్తున్న సైరా చిత్రం కూడా ఒక్కొక్కటిగా కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X