twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఏడుగురు ఎవరు? ఇండస్ట్రీలో సస్పెన్స్

    By Srikanya
    |

    చెన్నై: వందేళ్ల సినిమా...ముగింపు వేడుకల్లో సన్మాన కార్యక్రమం రాష్ట్రపతి చేతులమీదుగా జరుగనుంది. ఒక్కో రాష్ట్రం నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 28 మంది కళాకారులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సన్మానించనున్నారు. దీనికి సంబంధించిన నాలుగు రాష్ట్రాల సినీ ప్రముఖుల జాబితా ఇప్పటికే సిద్ధమైంది. ముఖ్యంగా ఈ ఉత్సవాల్లో నాలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏడుగురు కళాకారులు ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ వేదికపై నుంచి అవార్డులను సాధించిన వారిపేర్లు ఏడుగురి జాబితాలో ఉంటుందా..? ఉండదా..? అన్నది చర్చనీయాంశమైంది.

    తమిళనాడు నుంచి రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులకు పలువురి పేర్లతో కూడిన జాబితాను సౌత్‌ఇండియన్‌ ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ముఖ్యమంత్రి జయలలితకు అందించగా వారిలో నుంచి ఐదుగురు పేర్లను ముఖ్యమంత్రే స్వయంగా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో తమిళనాడు నుంచి ఏడుగురు ఎవరన్న విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమలోనూ ఇలాంటి ఉత్కంఠే కొనసాగుతోంది. సినీ పరిశ్రమలోని వివిధ రంగాల ప్రముఖులకు ఆదివారం సన్మానం జరిగింది.

    Who are Seven? Industry people Suspence

    కాని అత్యంత ప్రముఖుల పేర్లు మాత్రం ఇందులో రాలేదు. మంగళవారం జాబితాలో వారి పేర్లు ఉన్నందునే ఇంతవరకు వారిని సన్మానించలేదని తెలుస్తోంది. ఏడుగురు పేర్లను ముందుగానే ప్రకటిస్తే ఇతర కళాకారుల నుంచి అనవసర వివాదాలు తలెత్తుతాయన్న భావనతో వారి పేర్లను ప్రకటించకుండా నిర్వాహకులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. వారి వివరాలను రాష్ట్రపతి వేదికపై సీనులయ్యాకనే వెల్లడిస్తామని ఫిలింఛాంబర్‌ వర్గాలు పేర్కొన్నాయి.

    వందేళ్ల సినీ వేడుకలు చివరి రోజుకి చేరుకున్నాయి. దక్షిణాది సినీ రంగాలకు సంబంధించి గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాలు మంగళవారం ముగియనున్నాయి. ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు జయలలిత, కిరణ్‌కుమార్‌రెడ్డి, సిద్ధరామయ్య, ఉమెన్‌చాండి పాల్గొననున్నారు.

    ఈనెల 21 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో నాలుగు భాషలకు సంబంధించిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల సినీ ప్రముఖులను సన్మానించారు. తమిళనాడుకు చెందిన ప్రముఖులను ముఖ్యమంత్రి జయలలిత సన్మానించగా, తెలుగు ప్రముఖులను ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి డీకే.అరుణ, మరోమంత్రి ఘంటా శ్రీనివాసరావు సన్మానించారు. కన్నడ కళాకారులకు కర్ణాటక హోంమంత్రి జార్జ్‌, మలయాళం కళాకారులకు కేంద్రమంత్రి వాయిలార్‌ రవి సన్మానించారు. గత మూడు రోజుల్లో జరిగిన ఉత్సవాల్లో ఒక్కో రాష్ట్రం నుంచి 50-60 మంది కళాకారులకు సన్మానం జరిగింది.

    మళయాళీ సినిమా ఉత్సవాలు సోమవారం ఉదయం వైభవంగా జరిగాయి. కేంద్రమంత్రి వయలార్‌ రవి ప్రారంభించారు. కేరళ రాష్ట్ర మంత్రి కేసి జోసఫ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, మనోజ్‌, అంబిక, రాధా, వూర్వశి, శారద, రోహిణి, అభిరామి తదితరులు పాలుపంచుకున్నారు. కమల్‌హాసన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు అందజేశారు.

    English summary
    All four South Indian industries were geared up to honour their stars, who contributed to the growth of the industry. Tamil, Telugu and Kannada industries honoured their stars At 100 Years Of Cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X