Don't Miss!
- News అక్కడ వైసీపీని ఢీ కొట్టేదెవరు?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
ఆరంజ్ సినిమా నెగిటివ్ టాక్ స్ప్ర్రెడ్ చేసిన వారు సినిమా చూసి మాట్లాడండి
ప్రస్తుతం యావత్ తెలుగు పరిశ్రమ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆరంజ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నమాట వాస్తవమే. ఐతే ఈసినిమా ఎంతవరకు ఆడుతుందనేది అందరి మనసుల్లో ఉన్న చర్చనీయాంశం. దీనికి కారణం లేకపోలేదు. ఆరంజ్ సినిమా విడుదలకు ముందు రామ్ చరణ్ తేజ్ నిన్న తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నాడు. ఈ సందర్బంగా కలిసిన అభిమానులు ఆరంజ్ సినిమా ఏరేంజ్ లో ఉండబోతుందని అభిమానులు అడిగినటువంటి ప్రశ్నలకు నాకు తెలియదు, నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నానని సమాధానం చెప్పాడు.
దాంతో ఒక్కసారి షాక్ గురైన అభిమానులు రామ్ చరణ్ తేజ్ నోటివెంట అటువంటి సమాధాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆంద్రప్రదేశ్ మొత్తానికి ఈసినిమా మీద డౌట్ ఉన్నట్టే రామ్ చరణ్ తేజ్ కికూడా ఏమైనా డౌట్ ఉందా అంటూ అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. మొన్నటికి మొన్న ఈసినిమా నిర్మాత నాగబాబు మాట్లాడినప్పుడు ఆయన ముఖంలో కూడా కాన్ఫిడెంట్ అనేది కనిపించలేదని అభిమానులు వాపోతున్నారు.
అసలు ఓపెద్దహీరో సినిమా రిలీజ్ కిముందే ఇలాంటి నెగిటివ్ టాక్ కావాలనే కోంతమంది స్ప్ర్రెడ్ చేయడం అభిమానులు జీర్ణంచుకోలేకపోతున్నారు. అంతేకాకుండా ఆరంజ్ సినిమాకి సంబంధించి యూనిట్లోని ఏ ఒక్కరూ కాన్పిడెంట్ గాకనిపించకపోవడానికి కారణం సినిమాకి ఎక్కువ ఖర్ఛు పెట్టడమే కాకుండా, సినిమాలో విషయం లేదని మెగా అభిమానులకు అందిన సమాచారం. ఐతే కోంతమంది అభిమానులు మాత్రం సినిమా విడుదలైన తర్వాత ఇలాంటి వాటికి సినిమానే సమాధానం చెబుతుందని అంటున్నారు. విడుదలకు ముందు నెగిటివ్ టాక్ తెచ్చుకున్న రోబో బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చెయ్యలేదా అంటూ అభిమానులు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన వారిపై విరుచుకుపడుతున్నారు. ఇకపోతే ఈసినిమాని ఈనెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.