ఏం చిల్లరగాళ్లురా మీరు: ‘సాహో’ గురించి సోషల్ మీడియాలో అలా చేస్తే అంతే....
Recommended Video
ప్రభాస్ అభిమానుల రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబల్ స్టార్ మూవీ 'సాహో' నేడు గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో 2.0 తర్వాత హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రం ఇదే. యూవి క్రియేషన్స్ వారు రూ. 350 కోట్లు ఖర్చుతో హాలీవుడ్ స్థాయిలో దీన్ని తెరకెక్కించారు.
ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే దాదాపు అన్ని ఏరియాల్లో ఫస్ట్ వీకెండ్ వరకు టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇండియా కంటే ముందే ఓవర్సీస్ ఏరియాలో 'సాహో' షోలు మొదలయ్యయి. పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఉన్నారు.

‘సాహో' గురించి సోషల్ మీడియాలో అలా చేస్తే అంతే....
అరచేతిలో సెల్ ఫోన్, వాటి ద్వారా వీడియోలు చిత్రీకరించే అవకాశం వచ్చిన తర్వాత అభిమానులు థియేటర్లో సినిమాకు సంబంధించిన వీడియోలు, స్పాయిలర్స్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం తెలిసిందే. అయితే ‘సాహో' విషయంలో అలా చేస్తే కుదరదు. వెంటనే వాటిని తొలగిస్తారు. పదే పదే అలా చేస్తే మీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

ఈ విషయంలో నిర్మాతలు కఠినంగా...
స్పాయిలర్స్, లీక్ వీడియోల విషయంలో నిర్మాతలు చాలా కఠినంగా ఉన్నారు. అభిమానులు అత్యుత్సాహంతో చేస్తున్న ఈ చర్యల వల్ల సినిమాలోని కీలక విషయాలు, సీన్లు ముందే సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. ఇది సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
సాహో అలా చూసే సినిమా కాదు
‘సాహో' మూవీ పైరసీ ద్వారా లేదా ప్రైవసీ(ఒంటరిగా) చూసే సినిమా కాదు... ఈ సినిమాను థియేటర్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి చూసి విజువల్ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేయండి అంటూ తెలుగు సినీ నిర్మాతల్లో ఒకరైన ఎస్‌కెఎన్ ట్వీట్ చేశారు.
ఏం చిల్లరగాళ్లురా మీరు...
హృదయ కాలేయం దర్శకుడు, కొబ్బరి మట్ట నిర్మాత సాయి రాజేష్ లీక్ వీడియోలు, స్పాయిలర్లపై ఆసక్తికర కామెంట్ పోస్ట్ చేశారు. ఏం చిల్లరగాళ్లురా మీరు అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

సాహో
ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, ఎవలీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. సినిమా టాక్ చూస్తుంటే బ్లాక్ బస్టర్ విజయం అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications











