For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాళ్లు ఎవరో చెప్పు... కాళ్లకు దండం పెడతా: సునీత బోయ ఇష్యూపై బన్నీ వాసు

|

వివాదాలకు, కాంట్రవర్సీలకు అంటీ ముట్టనట్లు ఉండే బన్నీ వాసు పేరు ఇండస్ట్రీలో ఇపుడు మారుమ్రోగిపోతోంది. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగి సక్సెస్‌ఫుల్ రాణిస్తున్న ఆయనపై సునీత బోయ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి.

తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పా ఇవ్వకుండా మోసం చేశాడంటూ సునీత బోయ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం, అతడి ఆఫీసు వద్దకు వెళ్లి గొడవ చేయడం లాంటి సంఘటనలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వివాదంలో బన్నీ వాసు వివరణ ఇస్తూ ఇప్పటికే ఓ వీడియో కూడా విడుదల చేశారు.

ఆ ఒక్క పేరు చెప్పు చాలు... వాళ్ల కాళ్లకు దండం పెడతా

ఆ ఒక్క పేరు చెప్పు చాలు... వాళ్ల కాళ్లకు దండం పెడతా

‘‘బోయక్కా.. ఇన్ని హెల్పులు చేశావు కదా ఇంకొక్క హెల్ప్ కూడా చేయ్... నీకు పాలకొల్లులో నా ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారు? ఆ ఒక్క పేరు చెప్పు చాలు... నేను వాళ్ల కాళ్లకు దండం పెడతాను. ఆ పాలకొల్లు వ్యక్తిని నాకు ఒకసారి చూడాలని ఉంది.... అంటూ బన్నీ వాసు మరో వీడియో పోస్ట్ చేశారు.

అసలు ఏం జరిగిందంటే?

అసలు ఏం జరిగిందంటే?

సునీత బోయ అనే జూనియర్ ఆర్టిస్ట్ కొన్ని రోజుల క్రితం తనను సినిమా అవకాశాల కోసం సంప్రదించిన మాట నిజమే అని బన్నీ వాసు ఇటీవల ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఆమెకు కొన్ని ఆడిషన్స్ కూడా జరిగాయి. అందులో ఆమె ప్రూవ్ చేసుకోలేకపోయింది. మున్ముందు ఏమైనా ఉంటే చూద్దాం అని చెప్పాం. కానీ ఓపిక పట్టకుండా మా ఆఫీసుకు వచ్చి గొడవ చేయడం మొదలు పెట్టడంతో తాము పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలిపారు.

ఇలాంటి బిహేవియర్ ఉంటే అవకాశాలు రావు

ఇలాంటి బిహేవియర్ ఉంటే అవకాశాలు రావు

ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎవరికైనా ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. బ్యాలెన్స్ లేకుండా ఇలా చేస్తే ఇప్పుడే కాదు పది సంవత్సరాలైనా ఇలాగే ఉంటావు. బిహేవియర్ ఇలాగే ఉంటే నిన్ను తీసుకోవడానికి అంతా భయపడతారు. సినిమా షూటింగ్ అంటే ప్రతి నిమిషం లక్షలతో వ్యవహారం. షూటింగులో ఏదైనా చిన్న డిస్ట్రబెన్స్ జరిగినా లక్షల్లో నష్టం వస్తుంది. అందుకే ఆర్టిస్టుల బిహేవియర్ చాలా అబ్జర్వ్ చేస్తామని బన్నీ వాసు వెల్లడించిన సంగతి తెలిసిందే.

బన్నీ వాసు

బన్నీ వాసు

బన్నీ వాసు 100%లవ్, కొత్తజంట, పిల్లా నువ్వులేని జీవితం, భలే భలే మగాడివోయ్, నెక్ట్స్ నువ్వే, గీత గోవిందం లాంటి చిత్రాలను నిర్మించారు. ‘గీత గోవిదం' ఆయన తన కెరీర్లో అందుకున్న అతిపెద్ద విజయం. దీంతో పాటు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శ్రీరస్తు శుభమస్తు, సరైనోడు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.

English summary
Who gave you my phone number? Junior artist Sunita Boya was questioned by Bunny Vasu. She alleged that Bunny Vasu had cheated her by not giving her a chance to act in films.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more