Who is Avneet Kaur? ఎవరీ అవనీత్ కౌర్? విరాట్‌ కోహ్లీని వివాదంలోకి లాగిన ఈ భామ కథేంటో తెలుసా?

బాలీవుడ్‌లో వర్థమాన తారగా అదృష్టం పరీక్షించుకొంటున్న అవనీత్ కౌర్ ప్రస్తుతం ఇండియన్ మీడియాలోను, సోషల్ మీడియాలోను హాట్ టాపిక్‌గా మారింది. ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్‌లోనే కాకుండా గూగుల్‌లో కూడా ఈ భామ ఎవరు? అంటూ విస్తృతంగా సర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ భామ ట్రెండింగ్‌లోకి రావడానికి కారణం ఇండియన్ డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. అయితే ఈ భామకు కొహ్లీకి సంబంధమేమిటి? సడెన్‌గా ఈ అందాల భామ పేరు తెరపైకి రావడానికి కారణమేమిటి? ఇంతకు అవనీత్ కౌర్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..

అవనీత్ కౌర్ వ్యక్తిగత విషయానికి వస్తే.. భారతీయ టెలివిజన్, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న నటి. డ్యానస్ ఇండియా డ్యాన్స్, లిటిల్ మాస్టర్స్, ఝలక్ దిక్లాజా 5, సావిత్ర ఏక్ ప్రేమ్ కహానీ, హమారీ సిస్టర్ దీదీ లాంటి టెలివిజన్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించింది.

Who is Avneet Kaur

ఇక సినిమా రంగంలో ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. రాణి ముఖర్జీ నటించిన మర్దానీ మూవీ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. దోస్త్, ఖరీబ్ ఖరీబ్ సింగిల్, మర్దానీ 2, చిడియాఖానా, అల్లాద్దీన్, నామ్ తో సునా హోగా, టీకూ వెడ్స్ షేర్ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో వీడియోలతో ఎప్పుడూ హాట్ హాట్‌గా కనిపించే అందాల భామ ట్రాప్‌లో విరాట్ కోహ్లీ పడటంతో ఆమె పేరు మీడియాలో మార్మోగింది. ఆమె హాట్ ఫోటోలను విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం సెన్సేషన్‌గా మారింది. ఒక్కసారిగా ఆమె ఫోటోలు, పేరు ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఈ వ్యవహారం అనుష్క శర్మ పుట్టిన రోజునే చోటు చేసుకోవడంతో విరాట్ కోహ్లీ ఈ వివాదంలో ఇరుక్కుపోయాడు.

అవనీత్ కౌర్‌పై విరాట్ కోహ్లీ మనసు పారేసుకొన్నాడా? ఇంతమంది హీరోయిన్లు ఉండగా, ఆమె ఫోటోనే ఎందుకు లైక్ కొట్టాడు? అంటూ నానాఅర్ధాలు తీశారు. కొంతమంది కాస్త చొరవ తీసుకొని.. అనుష్క శర్మపై మోజు తీరిందేమో అంటూ కామెంట్స్ పెట్టారు. ఇలా గత రెండు రోజులుగా ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది.

అవనీత్ కౌర్ పేరు ఎత్తకుండా నా విషయంలో జరుగుతున్న వివాదంపై నేను క్లారిటీ ఇవ్వాలనుకొంటున్నాను. అల్గారిథమ్ కారణంగా తప్పుగా లైక్ కొట్టడం జరిగి ఉంటుంది. దాని వెనుక ఎలాంటి మరో ఉద్దేశం లేదు. దానిపై ఏవో ఊహగానాలు ఆపాదించుకోవద్దు. ఈ విషయాన్ని సరిగా అర్ధం చేసుకొన్న వారికి నా థ్యాంక్స్. అంతకు మించి నేను ఏమీ చెప్పడానికి ఏమీ లేదు అంటూ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.

More from Filmibeat

Read more about: avneet kaur virat kohli bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X