»   »  వెనుకున్న పెద్దలెవరు?

వెనుకున్న పెద్దలెవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీజ-శిరీష్ భరద్వాజ్ ల వెనుక పెద్ద హస్తమే ఉందనేది వారు ఢిల్లీలో చేస్తున్న హల్ చల్ ను చూస్తే ఇట్టే చెప్పవచ్చు. ఒక బీటెక్ విద్యార్థి, 18 ఏళ్ల శ్రీజలు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ కు వెళ్లడం వారి వెంట స్నేహితులు పెద్ద సంఖ్యలో ఉండడం, అంతా సెల్ ఫోన్ లలో మాట్లాడుతూ బిజీగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించడం చూస్తుంటే వీరి వెనకాల పెద్ద మనుషులు ఉన్నారని స్పష్టమవుతోంది. ఇంకా విచిత్రంమేమంటే మీడియాతో మాట్లాడిన తరువాత శిరీష్ స్వయంగా డ్రైవ్ చేస్తుండగా అతని పక్కన శ్రీజ కూర్చుంది. కారులో ఏంచక్కా ఢిల్లీలో షికార్లు చేస్తున్నవీరికి వెనుకాల ఎవరూలేకుండా ఎలా సాధ్యం.

అంతే కాకుండా పింకీ ఆనంద్ లాంటి పెద్ద లాయర్ ను తమ కేసును వాదించేలా చేయడం చూస్తుంటే వెనకాల మనుషులు చాలా పెద్దవారేనని తెలుస్తోంది. పింకీ ఆనంద్ తమ కేసును డీల్ చేయడానికి రూ.25 లక్షలు ఇచ్చినట్టుగా కూడా పుకార్లు వస్తున్నాయి. ఉండడానికి ఇల్లే లేని(ప్రకాశ్ నగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారని దిన పత్రికలలో వార్త వచ్చింది) శిరీష్ ఇంతపెద్ద మొత్తం ఎలా పెట్టగలిగాడనే కోణంలో చూస్తే శ్రీజ-శిరీష్ జంట వెనకాల పెద్ద హస్తాలే పకడ్భందీగా వ్యవహారాన్ని నడుపుతున్నట్టు తెలుస్తోంది.

Read more about: srija shirish
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X