ఛార్మి తాజా చిత్రం మంగళ లో అసలైన సస్పెన్స్ అదేనట...
ఛార్మి తాజాగా "మంగళ" అనే చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. వారు మాట్లాడుతూ ...ఓ యువతి జీవితం చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. అసలు ఈ కథలో మంగళ ఎవరు అనేది సస్పెన్స్. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాం. ఇందులో ఛార్మి నటన 'మంత్ర' చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది. విశ్వ స్వరాలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయని అన్నారు. ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మంగళ'. తులసీరామ్ దర్శకుడు. ఆయన సిహెచ్.వి.శర్మతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 11న పాటల్ని విడుదల చేస్తారు.
ఇటీవల ఛార్మీ , వెయ్యిమంది నాగ సాధువులు పై భారీ క్లైమాక్స్‌ను చిత్రించారు ఓషో తులసీరామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. చిత్ర దర్శకుడు ఓషో తులసీరామ్ ఇలా చెప్పారు. "ప్రేక్షకులకు నచ్చే వెరైటీ సబ్జెక్ట్ ఇది. గతంలో వచ్చిన 'మంత్ర' లాగానే మరో వైవిధ్యమైన అంశంతో ముందుకు సాగుతున్నాం. పాటలు కూడా రసవత్తరంగా ఉంటాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ చిత్రంలో ప్రదీప్‌రావత్, సుభాష్, రామ్‌జగన్, ఉత్తేజ్, పావలా శ్యామల తదితరులు నటించారు. సమర్పణ: గంగపట్నం శ్రీధర్, సహ నిర్మాత: బాణా నాగేశ్వరరెడ్డి, కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: విశ్వ.


Click it and Unblock the Notifications











