twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆటో నగర్ సూర్య' గా బాలయ్య లేక రవితేజనా?

    By Srikanya
    |

    "నేను అనాధే కానీ..అనామకుడ్ని కాను" - అనే పవర్ ఫుల్ డైలాగుతో డైలాగు టీజర్ వదిలిన దేవకట్టా తన ఆటోనగర్ సూర్యకి హీరో ఎవరన్నది మాత్రం ఫైనలైజ్ చెయ్యలేదు. అయితే ఓ వర్గం మాత్రం ఈ చిత్రంలో బాలకృష్ణ చేస్తాడని ప్రచారం చేస్తుంటే మరో ప్రక్క రవితేజ ఈ పాత్ర చేయటానికి సిద్దపడుతున్నాడంటూ వినపడుతోంది. విజయవాడ రౌడీయిజం చుట్టూ తిరిగే ఈ కథని మొదట రానా కోసం అనుకున్నారు. అయితే సురేష్ బాబు ఎంతకీ తేల్చటం లేదని వేరే నిర్మాతని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

    వెన్నెల, ప్రస్ధానం చిత్రాల దర్శకుడు దేవకట్టా తన తదుపరి చిత్రం ఆటోనగర్ సూర్య ని రూపొందించటానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం డైలాగ్ టీజర్ ని నెట్ లో విడుదల చేసారు. అందులో..."చూడు బాబాయ్...కొట్టుకు చావటానికి మన మధ్య ప్యాక్షన్ గొడవలు లేవు...భూమి మీద పుట్టిన ప్రతీ మనిషికీ ఒక హక్కుంది. ఎదగడం..తెలిసిన పనిచేసుకుంటూ కెపాసిటీకి తగ్గట్లు ఎదగడం..కానీ ఆ హక్కుని కబ్జా చేసి ఎదడమే నీ లాంటి లోఫర్లు హక్కు అనుకుంటారు. హిస్టరీలో జరిగిన ప్రతీ పోరాటానికి, విప్లవానికి, యుద్దానికి ఇదే కారణం. అవును నేను అనాధనే కానీ అనామకుడ్ని కాను...నా పేరు సూర్య...ఆటోనగర్ సూర్య. బాంచెత్...నేను ముట్టుకుంటే రిపేర్ చేయలేని వస్తువు లేదు.." అంటూ ఈ టీజర్ బేస్ వాయిస్ తో సాగుతుంది.

    ఇక ఈ చిత్రం గురించి చెబుతూ...ఎవరూ లేని ఓ వ్యక్తి అందరివాడుగా మారటమే అంటున్నారు. అలాగే ఈ చిత్రం ట్రేడ్ యూనియన్స్ బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ పూర్తయి...నటీనటులు, సాంకేతిక గణం ఎంపిక జరుగుతోంది అన్నారు. ఇంతకీ ఈ పాత్రకు సూటయ్యేది బాలకృష్ణ, రవితేజనా ఎవరైతే బావుంటారంటారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X