దీపావళి ధమాక దక్కించుకునే హీరో ఎవరు?

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ రియాజ్ హైదర్ మాట్లాడుతూ... 'దాదాపు 600 కోట్ల రూపాయల మార్కెట్ జరగనుంది. ఇందులో ఎవరు ఎక్కువ భాగాన్ని కొల్లగొడతారన్నది చూడాలి. రా.వన్, డాన్ 2 సినిమాలు అత్యధిక వసూళ్లు నమోదు చేయవచ్చు. 2011లో యామ్లా పాగ్లా దీవానా, తను వెడ్స్ మను, రెడీ, మర్డర్ 2, ఢిల్లీబెల్లీ, జిందగా న మిలేంగీ దోబారా, సింగం, మేరీ బ్రదర్‌కి దుల్హన్...మంచి బిజినెస్ చేశాయి. నిర్మాతలకు భారీ లాభాలే చేకూర్చాయి' అని అన్నారు.
మన టాలీవుడ్ విషయానికొస్తే ఇప్పటికే విడుదలైన దూకుడు, ఊసరవెల్లి చిత్రాలు మంచి కలెక్షన్లతో దూసుకెలుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలే తప్ప ఇతర పెద్ద సినిమాలే వీలేక పోవడంతో మంచి వసూళ్లూ సాధిస్తున్నాయి. దీపావళికి అటు, ఇటుగా శ్రీరామ రాజ్యం, మొగుడు, రాజన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరికొన్ని చిన్న సినిమాలతో కలిపి...ఈ దసర, దీపావళికి తెలుగు సినిమా మార్కెట్ దాదాపు 250 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఎక్కువ వాటాను దక్కించుకునే హీరో ఎవరో చూడాలి.


Click it and Unblock the Notifications











