twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపావళి ధమాక దక్కించుకునే హీరో ఎవరు?

    By Bojja Kumar
    |

    Who is Diwali Hero..?
    మన దేశంలో పండగ సీజన్లలో సినిమాలను విడుదల చేసి మంచి వ్యాపారం జరుపుకునే ఆనవాయితీ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇక బాలీవుడ్‌ విషయానికొస్తే... ఈ దీపావళికి రూ. 600 కోట్ల వ్యాపారంలో వీలైన ఎక్కవు వాటాను దక్కించుకునే ప్రయత్నంలో తలమునకలయ్యారు హీరోలు, దర్శక నిర్మాతలు. ఇంతియాజ్‌ అలీ తీసిన 'రాక్‌స్టార్‌' వస్తోంది. రణబీర్‌కపూర్‌ హీరోగా నటించాడు. అలాగే విద్యాబాలన్‌ మోస్ట్‌వాంటెడ్‌ మూవీ 'డర్టీ పిక్చర్‌', యశ్‌రాజ్‌ తీసిన 'లేడిస్‌ వర్సెస్‌..', ఫరాఖాన్‌ సినిమా 'డాన్‌ 2' త్వరలోనే సిద్ధమవుతున్నాయి.

    ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ రియాజ్‌ హైదర్‌ మాట్లాడుతూ... 'దాదాపు 600 కోట్ల రూపాయల మార్కెట్‌ జరగనుంది. ఇందులో ఎవరు ఎక్కువ భాగాన్ని కొల్లగొడతారన్నది చూడాలి. రా.వన్‌, డాన్‌ 2 సినిమాలు అత్యధిక వసూళ్లు నమోదు చేయవచ్చు. 2011లో యామ్లా పాగ్లా దీవానా, తను వెడ్స్‌ మను, రెడీ, మర్డర్‌ 2, ఢిల్లీబెల్లీ, జిందగా న మిలేంగీ దోబారా, సింగం, మేరీ బ్రదర్‌కి దుల్హన్‌...మంచి బిజినెస్‌ చేశాయి. నిర్మాతలకు భారీ లాభాలే చేకూర్చాయి' అని అన్నారు.

    మన టాలీవుడ్ విషయానికొస్తే ఇప్పటికే విడుదలైన దూకుడు, ఊసరవెల్లి చిత్రాలు మంచి కలెక్షన్లతో దూసుకెలుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలే తప్ప ఇతర పెద్ద సినిమాలే వీలేక పోవడంతో మంచి వసూళ్లూ సాధిస్తున్నాయి. దీపావళికి అటు, ఇటుగా శ్రీరామ రాజ్యం, మొగుడు, రాజన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరికొన్ని చిన్న సినిమాలతో కలిపి...ఈ దసర, దీపావళికి తెలుగు సినిమా మార్కెట్ దాదాపు 250 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఎక్కువ వాటాను దక్కించుకునే హీరో ఎవరో చూడాలి.

    English summary
    This Diwali season Who achieve a high collection? Who is that Hero..?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X