పవన్ గబ్బర్ సింగ్ కి ఫర్ఫెక్ట్ మున్నీ- శ్రియ, చార్మి, ముమైత్..!?
సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్"లో సోనూసూద్ విలన్ గా నటించాడు. కాగా 'దబాంగ్-2" సోనూసూద్ ని విలన్ గా తీసుకోవాలని అనుకున్నాడు. అందుకని ఈ సినిమా ప్రారంభించేలోపు విలన్ గా వేరే చిత్రాల్లో నటించకూడదని సోనూసూద్ కు సల్మాన్ ఓ కండీషన్ పెట్టాడు. తాజగా పవన్ కళ్యాణ్ హీరోగా 'దబాంగ్" తెలుగులో 'గబ్బర్ సింగ్" పేరిట రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కూడా సోనూసూద్ ని విలన్ గా నటింపజేయాలని పవన్ భావిస్తున్నాడట. అందుకని సల్మాన్ దగ్గర సోనూసూద్ ని 'గబ్బర్ సింగ్"లో విలన్ గా నటించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ అడిగాట. స్వయంగా పవన్ కళ్యాణ్ అడగడంతో సల్మాన్ అంగీకరించాడని తెలుస్తోంది..సో గబ్బర్ సింగ్ విలన్ సోనూసూద్ అని కన్ఫార్మ్ చేసుకోవచ్చు.
కాగా మరో పవర్ ఫుల్ పాత్ర అదే మున్నీ ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కావలేదు. మున్నీబద్నామ్ సాంగ్ తో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసి మలైకా అరోరా పాత్ర ఎవర్ని చేయించాలని తర్జనభర్జలు పడుతున్నట్టు సమాచారం. అయితే మున్నీ ఐటమ్ సాంగ్ కి టాలీవుడ్ లో టాప్ యాక్టర్స్ అయిన శ్రియ, ప్రియమణి, చార్మి, ముమైత్ ఖాన్ లలో కాంపిటీషన్ మొదలైంది. వీరిలో ఎవరు ఈ హాట్ అవకాశాన్ని సొంత చేసుకొంటారో వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











