చైతు-జూ ఎన్టీఆర్ ల సస్పెన్స్ తో సాగుతున్న 'గుండమ్మకథ'...?
పాతతరం క్లాసిక్ 'గుండమ్మకథ'ని జూనియర్ యన్టీఆర్, నాగచైతన్య కలిసి రిమేక్ చేయాలని ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలుసు. ఈ సంగతిని ఇటీవల నాగార్జున కూడా కన్ఫర్మ్ చేసిన దగ్గర్నుంచీ, ఈ ప్రాజక్ట్ పట్ల మరింత ఉత్సుకత పెరిగింది. అయితే, ఇందులో నటించే మిగతా ఆర్టిస్టుల విషయం ఎలా ఉన్నప్పటికీ ఆనాడు సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రను ఇప్పుడు ఎవరు పోషిస్తారన్నదే అందరిలోనూ క్యురియాజిటీని రేకెత్తిస్తోంది. ఈ పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒకప్పటి అందాల తార రాధ అయితే బాగుంటుందని నిన్నటి వరకూ అనుకున్నప్పటికీ, తాజాగా రోజా, రమ్యకృష్ణలను పరిశీలిస్తున్నారట. వీళ్లిద్దరూ అయితే గ్లామర్ కి గ్లామరూ, పెర్ఫార్మెన్స్ కి పెర్ఫార్మేన్సూ ఉంటుందని భావిస్తున్నారట. వీళ్లిద్దరిలోనూ మళ్లీ రమ్యకృష్ణకే ఎక్కువ చాన్స్ వుందని అంటున్నారు. చూద్దాం... చివరికి ఆ పాత్రను ఎవరు దక్కించుకుంటారో?


Click it and Unblock the Notifications











