జూ.ఎన్టీఆర్ "దాన వీర శూర కర్ణ" కి నిర్మాత ఎవరు?

By Srikanya

ఎన్టీఆర్ తనకెంతో ఇష్టమైన తన తాతగారి "దాన వీర శూర కర్ణ" చిత్రాన్ని రీమేక్ చేయాలని ఎప్పటినుంచో అంటూ వస్తున్నారు. అలాగే దాన్ని ఖచ్చితంగా తనకు ఇష్టమైన ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలోనే చేయాలని ఆయన ఆలోచన. అయితే ఈ టాపిక్ చాలా కాలం నుండీ నలుగుతోంది. ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ చిత్రం చేస్తారో లేదో తెలియదు కానీ రోజుకో వార్త ఈ విషయమై వినపడుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనే విషయమై చర్చ ప్రారంభమైంది. కొందరు అశ్వనీదత్ అంటూంటే అదేం కాదు ఖచ్చితంగా దాన్ని ఎన్టీఆర్ మామ అయిన నార్నే శ్రీనివాసరావు నిర్మిస్తారని చెప్తున్నారు. తన అల్లుడుకి తను ఇవ్వబోయే గిప్ట్ అవుతుందని ఆ చిత్రం నిర్మిస్తే మగధీర రేంజిలో ఆడుతుంది కాబట్టి భయపడడని చెప్తున్నారు.

ఇక ఈ చిత్రంలోని వచ్చే ముఖ్య పాత్రలను పెద్ద ఎన్టీఆర్ లాగే తాను చేయాలని అలా తన పౌరాణికాలలో తాను రాణించగలనని చెప్పాలనుకుంటున్నారు. యమదొంగలో తన యముడు గెటప్ కు వచ్చిన రెస్పాన్స్ కూడా ఈ ఆలోచన చేయటానికి కారణం అని అంటున్నారు. అయితే ఈ విషయమై రాజమౌలి ట్విట్టర్ లో ఒకసారి స్పందిస్తూ.. అటువంటి ప్రాజెక్టు ఏదీ తాను చేయబోవటం లేదని స్పష్టం చేసారు. అయితే డైరక్టర్ ఎవరైనప్పటికీ ఎన్టీఆర్ మాత్రమే హీరోగా చేస్తారని అన్నారు. కాబట్టి ఫ్యాన్స్ ని వర్రీ కావద్దని అన్నారు.ఏదైమైనా త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంభందించిన పూర్తి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X