Who is Pawan Kalyan? ఎవరీ పవర్‌స్టార్?.. జాతీయ మీడియాను షేక్ చేస్తున్న పవన్ కల్యాణ్ సునామీ!
ఆంధ్ర ప్రదేశ్‌లోను అలాగే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగిసాయి. ఎవరూ ఊహించని ఫలితాలు దేశవ్యాప్తంగాను, ఏపీలోను వెల్లడయ్యాయి. ఇక కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నాయి. ఈ రెండు ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా, తిరుగులేని వ్యూహాన్ని రచించిన పవన్ కల్యాణ్ గురించే అందరి నోట వస్తున్న మాట భేష్.. పవర్ స్టార్. ఇక జాతీయ మీడియాలో పవన్ కల్యాణ్ గురించి వెలువడుతున్న కథనాలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ఎన్నికలకు ముందు నుంచి కూడా అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానని పవన్ కల్యాణ్ శపథమే చేశాడు. తాను పట్టుబట్టి ఎడమొగం.. పెడ మొగం ఉన్న టీడీపీ, బీజేపీ పార్టీలను ఏకం చేశాడు. పొత్తుల్లో భాగంగా తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడానికి తనకు కేటాయించిన సీట్లను వదులుకొని త్యాగానికి సిద్దపడ్డాడు. అందుకు కారణం వైఎస్ జగన్ పతనం చూడటమే.

ఇక ఎన్నికల తర్వాత తాను పోటీ చేసిన అన్ని స్థానాలు అంటే.. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడం సరికొత్త చరిత్రగా మారింది. ఇప్పుడు 100 శాతం స్ట్రైక్ రేట్ అనేది జాతీయ మీడియాలో ఊతపదంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను పవన్ కల్యాణ్ ఆకట్టుకొంటున్నారు.
పవన్ సాధించిన విజయంపై భాష, ప్రాంతం, ఎల్లలు లేకుండా కథనాలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఈ పక్కన కూర్చున్న వ్యక్తి పవన్ కాదు.. తుఫాన్. ఏపీ రాజకీయాలను ఓ రేంజ్‌కు తీసుకెళ్లి.. ఎన్డీఏకు బలంగా మారాడు అని ప్రధాని మోదీ చెప్పడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.

దాంతో జాతీయ మీడియా పవన్ కల్యాణ్ గురించి ఉత్తరాది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నది. పవన్ కల్యాణ్ అంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్. లెజెండరీ యాక్టర్ చిరంజీవికి సోదరుడు.. అలాగే రాంచరణ్‌కు బాబాయ్ అంటూ కథనాలతో ఆకట్టుకొంటున్నది. అలాగే బాలీవుడ్‌లో సల్మాన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సెలబ్రిటీ అంటూ మీడియా వీడియోలు క్రియేట్ చేయడం ఆయన క్రేజ్ మరో రేంజ్‌కు వెళ్తున్నది.


Click it and Unblock the Notifications











