‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్ర పోషించింది ఎవరు?
ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పునర్జన్మ దర్శనం పేరుతో రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. ఈ చిత్రంలో రామారావు పాత్ర పోషించిన వ్యక్తి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. టీజర్ చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్టీఆర్ పైనుంచి దిగివచ్చినట్లే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ఈ యాక్టర్ ఎవరో చాలా మందికి అంతు పట్టడం లేదు. ఎప్పుడూ తెలుగు సినిమాలో చూసి ముఖం కాదు. అతడు ఎవరు? అని అందరూ ఆరాతీస్తున్న నేపథ్యంలో వర్మ అసలు విషయం బయట పెట్టారు.

ఎన్టీఆర్ పాత్ర పోషించిన వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడుగా వర్మ పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాదిరిగా నడవటం, మాట్లాడటం, బాడీలాంగ్వేజ్ అనుకరించడం లాంటి విషయాల్లో కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. లక్ష్మి పార్వతి పాత్రను కన్నడ నటి యజ్ఞ శెట్టి పోషిస్తున్న సంగతి తెలిసిందే.
శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్ బుక్ అన్నింటిలో కలిపి 1.5 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. ఈ వీడియో సరిగ్గా సాయంత్రం 6.57 నిమిషాలకు విడుదల చేశారు. 6+5+7 =18.. 1+8 = 9 ఎన్టీఆర్ బాగా నమ్మే లక్కీ నంబర్ అని వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











