హిందీ'బిజినెస్ మ్యాన్'మహేష్ కాదు..మరి
హిందిలో మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ని రీమేక్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ మొదట నటిస్తాడు అనుకున్నా ఇప్పుడు సీన్ లోకి వేరే హీరో వచ్చాడని తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ 2012 మొత్తం పూర్తి బిజిగా ఉన్నారు. ఈ సంవత్సరంలో మూడు చిత్రాలు కమిటై ఉన్నాడు. ఈ నేపధ్యంలో హిందీ బిజినెస్ మ్యాన్ కి టైమ్ ఉండదని చెప్తున్నారు. మరి ఈ మహేష్ ప్లేస్ లోకి ఎవరు వస్తారు అంటే రణబీర్ కపూర్ అని తెలుస్తోంది. రాక్ స్టార్ తో చతికిలపడ్డ రణబీర్ ఈ చిత్రం చూసి ఈ రీమేక్ లో చేయటానికి చాలా ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. అతను కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసి చూపించటం జరిగింది. మొదట ఈ రీమేక్ కు గానూ అభిషేక్ బచ్చన్ ని అనుకోవటం జరిగింది. అయితే అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ రీమేక్ పై రామ్ గోపాల్ వర్మ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ విషయం ఆయన ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం పూరీ జగన్ బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని హిందీ ఆడియన్స్ సెన్సిబులిటీస్ కు అణుగుణంగా రీరైట్ చేస్తున్నారు. పూరీ నాతో హిందీ బిజినెస్ మ్యాన్.. తెలుగు కన్నా పది రెట్లు బెటర్ గా ఉంటుంది అని చెప్పారు. అలాగే నేను ఈ చిత్రాన్ని నేను నిర్మించబోవటంతో చాలా ధ్రిల్లింగా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం పూరీకే దక్కుతుంది. అతను హిందీ వెర్షన్ కోసం చెప్పుతున్న మార్పులు, ట్రీట్ మెంట్ వింటూంటే గ్యారెంటీగా హిందీలో పెద్ద హిట్టవుతుందనిపిస్తోంది. ఈ చిత్రం అండర్ వరల్డ్ సినిమాలకు మదర్ లా తయారవుతుంది అనిపించింది. ఇక ధీరూభాయ్ అంబానీ తను వ్యాపారం కాకుండా ముంబై మాఫియాలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా కథ తయారవుతోంది అని ట్వీట్ చేసారు. మరో ప్రక్క పూరీ ఈ చిత్రం ఈ రేంజి విజయం సాధించటంపై చాలా ఆనందంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











