For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తొలి సినిమా రిలీజ్ కాకుండానే ఆ కుర్రాడికి వీర క్రేజ్

  By Srikanya
  |
  Revanth
  హైదరాబాద్ : ఇప్పుడు తెలుగు సిని పరిశ్రమలో ఏ నలుగురు కలిసినా రేవంత్ ఎలా ఉన్నాడనే టాపిక్ నడుస్తోంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఇంటింట అన్నమయ్య చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న రేవంత్ పైనే అందరి దృష్టి. ఈ కుర్రాడు పోస్టర్స్ విడుదల కావటంతో చాలా మంది దర్శక,నిర్మాతలు దృష్టి ఈ కుర్రాడిపై పడింది. మరో స్టార్ అయ్యే హీరో వచ్చాడంటున్నారు. రేవంత్ తొలి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

  రేవంత్ ఎవరో కాదు..ఇంటింట అన్నమయ్య నిర్మాత యలమంచిలి సాయిబాబు కుమారుడు. బిజినెస్ లో సెటిల్ అవ్వాలని బిబిఎమ్ డిగ్రీని న్యూజ్ ల్యాండ్ లో చేసుకుని వచ్చిన ఈ కుర్రాడు జర్నలిజం వైపుకు మరులుదామనుకున్నాడు. అనుకోకుండా నటుడు అయ్యాడు. రాఘవేంద్రరావు గారు హీరోని చేద్దామని ప్రపోజల్ పెట్టడంతో అనుకోనివిధంగా హీరోని అయ్యానంటున్నాడు. వైజాగ్ లో సత్యానంద్ గారి వద్ద ట్రైనింగ్ అయ్యి వచ్చాడు.

  ఆ యువకుడికి పాశ్చాత్య సంగీతమంటే మహా ప్రీతి. ర్యాప్‌, పాప్‌... అంటూ గిటారుపట్టుకొని ఆ దిశగానే అడుగులు వేశాడు. అయితే అన్నమయ్య కీర్తనలు విన్నాక మన సంగీతంలోని గొప్పదనాన్నీ, ఆయన రచనలోని వైశిష్ట్యాన్నీ తెలుసుకొన్నాడు. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీదే చూడమంటున్నారు రాఘవేంద్రరావు.

  హీరో రేవంత్ చిత్ర విశేషా లను వివరిస్తూ తెలుగు సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేయడానికి నిర్మించిన చిత్రం 'ఇంటింటా అన్నమయ్య' అని ఈ చిత్రంలో ప్రధానపాత్రలో తాను నటించడం ఆనందంగా వుందని, కీరవాణి అందించిన గీతాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని తెలిపారు. అందరి అభిరుచులను దృష్టిలో వుంచుకొని పాటలను సంప్రదాయ గీతాలుగా, చందమామ పాటలుగా, రాక్ సాంగ్స్‌గా రూపొందించారని, సంగీత సాహిత్య విలువలుగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుందని, ప్రతి ఇంటా అన్నమయ్య పాటలు సంకీర్తన చేయాలని ఆయన వివరించారు.

  నిర్మాత మాట్లాడుతూ ''అన్నమయ్య గీతాలకీ ఓ యువకుడి జీవితానికీ ఉన్న బంధమే ఈ కథ. అదేమిటో తెర మీదే చూడాలి. నవతరానికి తెలుగుదనాన్నీ, సంప్రదాయాల్నీ చెప్పేలా ఉంటుంది. రాఘవేంద్రరావు కథను ఆవిష్కరించిన తీరు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి'' అన్నారు.

  బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, ఏవీయస్, జయప్రకాష్‌రెడ్డి, సుబ్బరాయశర్మ, భూషణ్, సుధ, హేమ, సురేఖావాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సాయిబాబా మూవీస్ యూనిట్, మాటలు: ఉమర్‌జీ అనురాధ, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: యలమంచిలి సాయిబాబు, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.

  English summary
  
 Revanth opened the door to stardom, with the movie 'Intinta Annamayya', directed by K. Raghavendra Rao. Revanth does not come from a typical filmi background; he hails from a business family and his biggest supporter is his father. “He is the only actor, or rather ‘accidental’ actor, in the family. I assumed that he, like his elder brother, would join the family business. But when Raghvendra Rao presented this opportunity, I did what any dad should do: support their children,” says Sai Babu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X