twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అదిరింది’ని అడ్డుకుంటున్నది ఎవరు? రాజకీయ కుట్ర?.. జోషి సంచలన వ్యాఖ్యలు

    వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టంపై ధ్వజమెత్తుతూ హీరో విజయ్ చెప్పిన డైలాగ్స్‌పై తమిళనాడులోని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం మరింత ముదిరింది. అయితే ప్రస్తుతం మెర్సల్ అనువాదం అదిరింది రిలీజ్‌

    By Rajababu
    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బాగా చర్చ జరుగుతున్న చిత్రం మెర్సల్. దీపావళి కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత అనేక వివాదాలు చుట్టుముట్టాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టంపై ధ్వజమెత్తుతూ హీరో విజయ్ చెప్పిన డైలాగ్స్‌పై తమిళనాడులోని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం మరింత ముదిరింది. అయితే ప్రస్తుతం మెర్సల్ అనువాదం అదిరింది రిలీజ్‌ కాకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. దాని వెనుక పలువురు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

    మెర్సల్‌లో జీఎస్టీ వివాదం

    మెర్సల్‌లో జీఎస్టీ వివాదం

    మెర్సల్ చిత్ర క్లైమాక్స్‌లో జీఎస్టీ తీరుపై మండిపడుతూ చెప్పిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ చిత్రంలోని డైలాగ్స్‌ను తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఆ వివాదం అలా కొనసాగుతుండగానే తెలుగులో డబ్ అయిన ఆ చిత్ర రిమేక్ అదిరింది అనేక కష్టాలు వచ్చి పడ్డాయి.

    అదిరింది రిలీజ్ వాయిదా

    అదిరింది రిలీజ్ వాయిదా

    వాస్తవానికి మెర్సల్ రిలీజ్ రోజే అదిరింది సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కానీ ఆ రోజు విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత మరో డేట్‌ను ప్రకటించినా అది సాధ్యం కాలేదు.

    అక్టోబర్ 27న రిలీజ్ డేట్

    అక్టోబర్ 27న రిలీజ్ డేట్

    చివరికి సెన్సార్ అనంతరం అక్టోబర్ 27న విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ప్రేక్షకులకు ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయించారు. అయినా అదిరింది చిత్రం విడుదలకు నోచుకోలేదు. దాంతో అసలు అదిరింది సినిమా విడుదల అవుతుందా? సందేహాలు వెంటాడుతున్నాయి.

    అసలు సెన్సార్ సమస్య కాదు..

    అసలు సెన్సార్ సమస్య కాదు..

    అదిరింది రిలీజ్ కాకపోవడం వెనుక సెన్సార్ సమస్యలు కాదు. రాజకీయ కారణాలు ఉన్నాయి అనే వాదన సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. అదిరింది సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణం సెన్సార్ బోర్డు కాదు. ఆ చిత్రంలో సీన్లను తొలగించలేదు అని సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషి చెప్పడంతో దాని వెనుక మరో కోణం బయటకు వచ్చింది.

    సెన్సార్‌కు 68 రోజులు పట్టవచ్చు..

    సెన్సార్‌కు 68 రోజులు పట్టవచ్చు..

    అదిరింది చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు అని మాపై ఆరోపణలు చేయవద్దు. ఓ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కనీసం 68 రోజులు పట్టడానికి వీలు ఉంటుంది. అయితే సాధ్యమైనంత త్వరగా అదిరిందికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తాం అని జోషి ఇటీవల మీడియాతో అన్నారు. దాంతో అదిరింది రిలీజ్‌ను అడ్డుకోవడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

    తెలుగులో శరత్ మరార్ రిలీజ్

    తెలుగులో శరత్ మరార్ రిలీజ్

    తెలుగులో ప్రముఖ నిర్మాత శరత్ మరార్ అదిరింది చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 41 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అనేక కారణాల వలన ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.

    English summary
    CBFC chief Prasoon Joshi has denied allegations of deleting controversial dialogues and delaying the release of Adirindhi, which is the Telugu version of Vijay's Mersal.Adirindi was scheduled to be released in the theatres along with its original Tamil version Mersal on October 18. But its release was deferred due to the delay in its censorship. Later, the makers revealed that the dubbed film will hit the screens on October 27. But they once again postponed the movie to an uncertain date due to some reason.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X