»   » బికినీ అందాలతో దుమ్మురేపే ధూమ్ గర్ల్స్(ఫోటో ఫీచర్)

బికినీ అందాలతో దుమ్మురేపే ధూమ్ గర్ల్స్(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ నెల 20న విడుదల కాబోతున్న 'ధూమ్-3' చిత్రం ఎంతో మంది సినీ అభిమానులను ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వచ్చిన రెండు సీక్వెల్స్ విజయవంతం అయిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదిరిపోయే యాక్షన్ సన్నివేషాలు, తమ హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్‌తో అలరించే హీరోయిన్లు, ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్‌తో సాగే 'ధూమ్' సిరీస్ సినిమాలపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం.

తాజాగా విడుదల కాబోతున్న 'ధూమ్-3' చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, సెక్సియెస్ట్ హీరోయిన్ కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, జాకీ ష్రాఫ్ ముఖ్య మైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కత్రినా కైఫ్ తన హాట్ హాట్ అందాలు ఆరబోయస్తూ చేసిన 'ధూమ్ మచాలే..' సాంగు సినిమాకు హైలెట్ కానుంది.

ధూమ్ చిత్రం మొదటి సిరీస్‌లోని 'ధూమ్ మచాలే..' సాంగులో ఇషా డియోల్ బికినీలో దర్శనమిచ్చి అందరి మతులు పోగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ముందుగానీ, ఆ సినిమా తర్వాత గానీ ఇషా డియోల్ మళ్లీ అలాంటి హట్ అప్పియరెన్స్ ఇవ్వలేదు. ఆమె అందాల ఆరబోత అప్పట్లో సినిమాకు హైలెట్ అయింది.

ఇక ధూమ్-2 చిత్రంలో ఐశ్వర్యరాయ్, బిపాసా బసు తమ అందాలతో మతి పోగొట్టారు. ధూమ్-2 సినిమాకు ఐశ్వర్యరాయ్ అందాలు, పెర్ఫార్మెన్స్, హృతిక్ రోషన్ చేసిన సాహసాలు సినిమాకు హైలెట్‌గా మారాయి. ఈ సారి 'ధూమ్-3' చిత్రంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్.

మరి ఇప్పటి వరకు ధూమ్ సిరీస్ సినిమాల్లోవచ్చిన హీరోయిన్లలో ఎవరు హాట్ అండ్ సెక్సీగా ఉన్నారో మీరే నిర్ణయించండి....

ఇషా డియోల్

ఇషా డియోల్


ధూమ్ చిత్రంలో ఇషా డియోల్ అప్పట్లో బికినీలో హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చి అందరి మతులు పోగొట్టింది. ఈ చిత్రంలో ఇషా డియోల్ ఉదయ్ చోప్రా సరసన నటించింది. ఇద్దరి మధ్య ఈ చిత్రంలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

ఐవ్వర్యరాయ్

ఐవ్వర్యరాయ్


ధూమ్-2 చిత్రంలో నటించిన ఐశ్వర్యరాయ్ సన్నజాజితీగలా మారి తన పెర్ఫార్మెన్స్‌తో అందరి మతి పోగొట్టింది. ఈ చిత్రంలో హృతిక్, ఐశ్వర్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

బిపాసా బసు

బిపాసా బసు


ధూమ్-2 చిత్రంలో బిపాసా బసు కూడా తన అందాలతో అందరి మతుల పోగొట్టింది. ఈ చిత్రంలో ఆమె ఉదయ్ చోప్రాకు జోడీగా నటించింది.

రిమి సేన్

రిమి సేన్


ధూమ్-2 చిత్రంలో నటించిన మరో భామ రిమిసేన్. ఈ చిత్రంలో ఆమె అభిషేక్ బచ్చన్‌కు జోడీగా నటించింది.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్


ఇపుడు ధూమ్-3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కత్రినా కైఫ్. ఈచిత్రంలో కత్రినా అందాల ప్రదర్శనతో పాటు, సాహస విన్యాసాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.

English summary
The much awaited movie for the year 2013, Dhoom 3, is all set to hit the theaters this Friday, 20th December. All are set to watch the thrid sequel of this superhit flick starring Aamir Khan, Katrina Kaif, Abhishek Bachchan, Uday Chopra and Jackie Shroff in the lead. As usual, Dhoom 3 too will feature the 'Dhoom machale...' song performed by Katrina.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu