జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్...
కెరీర్ పరంగా జూ ఎన్టీఆర్ వయసు 12 ఏళ్లే అయినా సంపాదించుకున్న ఇమేజ్ అంతకంటే ఎక్కువే. ఈ ఫాలోయింగ్ ఈ నందమూరి అందగాడికి అంత ఈజీగా వచ్చేసింది కాదు. ఇంటి పేరు, తాత రూపు ఇనిషియాల్ గా ఓ ఫ్లాట్ ఫారాన్ని ఏర్పరిస్తే... మిగతాదంతా అతని కష్టార్జితం.
డ్యాన్సుల్లో గానీ, యాక్షన్ సీన్స్ లో కానీ అతను పడే కష్టం, తపన, తాపత్రయం అతన్నీవేళ ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆ కష్టమే అతనికి శ్రీరామరక్షగా నిలుస్తుంది. ముందు ముందు మరిన్ని విజయాలకు నాంది. మే 20, 1983 పుట్టిన ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్టుగా బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటించారు. రెండో చిత్రానికే తాత వారసత్వం నిలబెడుతూ శ్రీరాముడుగా గుణశేఖర్ దర్శకత్వంలో బాల రామాయణంలో కన్పించి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెత నిజం చేసారు.
హీరోగా చేసిన తొలి ప్రయత్నం నిన్ను చూడాలని ఉంది (2001) యావరేజ్ ఫలితాలను ఇచ్చినప్పటికీ...స్టూడెంట్ నెం.1 చిత్రంతో తన సత్తా చాటాడు. అక్కడనుంచి తిరుగులేకుండా సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు. టాప్ టాప్ హీరోల్లో చోటు సుస్థిరం చేసుకున్నాడు. జూనియర్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ కలకాలం అభిమానులకు వినోదం పంచాలని ఆశిస్తూ...ఎన్టీఆర్‌కి వన్ఇండియా డాట్ కామ్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications












