2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

By Bojja Kumar

హైదరాబాద్: 2012 సంవత్సరంలో టాలీవుడ్లో 160పైగా చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో దాదాపు 50 వరకు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తెలుగు సినిమాలకు ఎంతో కొంత కలిసొచ్చిందనే చెప్పాలి. హిట్లు లేని చాలా మంది స్టార్స్... ఈ ఏడు విజయవంతమైన సినిమాలతో గట్టెక్కారు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, రవితేజ, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ తదితర హీరోలు ఈ సంవత్సరం బాక్సాఫీసు బరిలో నిలిచి నెం.1 స్థానం కోసం పోటీ పడ్డారు. రాణా దగ్గుబాటి, నాని, అల్లరి నరేష్ లాంటి హీరోలు కూడా బాక్సాఫీసు వద్ద తమ స్టామినా చాటడానికి తమ వంతు ప్రయత్నం చేసారు.

చాలా కాలంగా హిట్ లేని పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం 'గబ్బర్ సింగ్' సినిమాతో బాక్సాఫీసు వద్ద తన సినిమా బిజినెస్ స్టామినా ఏమిటో నిరూపించాడు. ఆరెంజ్ సినిమా ప్లాపుతో డీలా పడ్డ రామ్ చరణ్ తేజ్ 'రచ్చ' సినిమాతో కలెక్షన్ల రచ్చ సృష్టించాడు. అదే విధంగా బద్రీనాథ్‌తో గత సంవత్సరం బోల్తాపడ్డ అల్లు అర్జున్ ఈ సంవత్సరం 'జులాయి'గా సక్సెస్ అయ్యాడు.

మరి ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్ ఎవరో మీరే నిర్ణయించండి.... ఓటింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

పవన్ కళ్యాణ్: గత సంవత్సరం ప్లాపులు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్... ఈ సంవత్సరం ‘గబ్బర్ సింగ్' చిత్రంతో భారీ హిట్ కొట్టి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టారు. ఆయన నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

మహేష్ బాబు: గత సంవత్సరం దూకుడుతో భారీ విజయం సాధించిన మహేష్ బాబు ఈ సంవత్సరం ‘బిజినెస్ మేన్' చిత్రంతో మంచి ఓపెనింగ్స్ సాధించారు.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

నాగార్జున: నాగార్జున ఈ సంవత్సరం షిరిడి సాయి, డమరుకం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. షిరిడి సాయి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేక పోయింది. డమరుకం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

బాలకృష్ణ: బాలయ్య ఈ సంవత్సరం అధినాయకుడు, ఊకొడతారా ఉలిక్కి పడతారా, శ్రీమన్నారాయణ చిత్రాల్లో నటించారు. ఇందులో శ్రీమన్నారాయణ ఫర్వాలేదనిపించగా... మిగిలిన రెండు అంచనాలను అందుకోలేక పోయాయి.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

రామ్ చరణ్ తేజ్: గతంలో ఆరెంజ్ సినిమాతో డిజాస్టర్ చవిచూసిన రామ్ చరణ్ తేజకు ‘రచ్చ' చిత్రం హిట్ కావడం ఊరటనిచ్చింది.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

జూ ఎన్టీఆర్: జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం తన ‘దమ్ము' చూపిద్దామని ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్ కాలేదు.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

రవితేజ: హీరో రవితేజకు ఈ సంవత్సరం కూడా కలిసి రాలేదు. రవితేజ నటించిన నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు చిత్రాలు కూడా అంచనాలను అందుకోలేక పోయాయి.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

ప్రభాస్: ప్రభాస్ ఈ సంవత్సరం ‘రెబల్' చిత్రంలో నటించాడు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

అల్లు అర్జున్: గత సంవత్సరం బద్రీనాథ్‌తో ప్లాప్ చవి చూసిన అల్లు అర్జున్... ఈ సారి జులాయిగా తన సత్తా చాటాడు.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

రాణా: కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంతో కమర్షియల్ హీరోగా పేరుతెచ్చుకుందామనుకున్న రాణా... నటన పరంగా మంచి మార్కులే కొట్టేసాడు. కానీ సినిమా మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

2012లో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరు?(ఓట్ వేయండి)

నాని: హీరో నానికి ఈ సంవత్సరం కూడా బాగా కలిసొచ్చింది. ఆయన నటించిన ఈగ చిత్రం పెద్ద హిట్టవ్వగా, ఎటో వెళ్లిపోయింది మనసు ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X