Just In
- 34 min ago
ముద్దు పెట్టలేదని వదిలేసింది.. పెళ్లి కంటే ముందే ఒక లవ్ స్టొరీ.. బ్రేకప్ గురించి చెప్పిన స్టార్ హీరో
- 56 min ago
బయటపడ్డ యాంకర్ ప్రదీప్ నిజస్వరూపం: యంగ్ సింగర్‌తో అలా.. అందరి ముందే ప్రామిస్ చేయడంతో!
- 1 hr ago
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని కామెంట్స్: అప్పుడే జరుగుతుందని బాంబ్ పేల్చిన రెబెల్ స్టార్
- 2 hrs ago
ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: అసలు విషయం లీక్ చేసిన అఖిల్.. మోనాల్ పరిస్థితేంటి మరి?
Don't Miss!
- Automobiles
భారత్‌లో కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి లాంచ్; పూర్తి వివరాలు
- Finance
బ్యాంక్రప్టసీ: కేంద్రం ఆ సవరణలకు సుప్రీం కోర్టు సమర్థన
- News
అఖిలప్రియకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక వివరాల వెల్లడి... నేడు సీన్ రీకన్స్ట్రక్షన్.. తేలనున్న బెయిల్..?
- Sports
ISL 2020 21: బెంగళూరు చిత్తు.. కేరళ బ్లాస్టర్స్ ఖాతాలో మరో విజయం!!
- Lifestyle
గురువారం దినఫలాలు : సింహరాశి వారు ఈరోజు ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డ్రగ్స్‌తో పట్టుబడ్డ టాలీవుడ్ హీరోయిన్.. సీక్రెట్‌గా విచారణ.. అరెస్ట్ అయింది ఎవరంటే!
బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలున్న టాలీవుడ్ హీరోయిన్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారనే వార్త తెలుగు సినిమా పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. తెలుగు సినిమా హీరోయిన్‌ను అరెస్ట్ చేశామంటూ వెల్లడించినప్పటికీ.. ఆ వ్యక్తి పేరు గోప్యంగా ఉంచడంతో ఆమె ఎవరా అనే అంశం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అయితే ఆమె పేరును వెల్లడించకపోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయనే విషయాన్ని అధికారులు నర్మగర్భంగా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎంఎన్సీ ఉద్యోగితో పట్టుబడ్డ హీరోయిన్
గత కొద్దికాలంగా ముంబైలోని మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న చాంద్ మహ్మద్ షేక్ అనే వ్యక్తి డ్రగ్స్ సఫ్లయ్ చేస్తున్నారనే విషయం ఎన్సీబీ దృష్టికి వచ్చింది. ముంబైలోని భయాండర్ ప్రాంతానికి చెందిన సయీద్‌పై ఎన్సీబీ నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముందస్తు సమచారంతో మీరా రోడ్డులోని ఓ హోటల్‌పై ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే దాడులు నిర్వహించారు.

డ్రగ్ సప్లయర్ రూమ్‌లో
డ్రగ్ సప్లయిర్ సయీద్ హోటల్ రూమ్‌పై దాడి చేసిన తర్వాత సమీర్ వాంఖడే మీడియాతో మాట్లాడారు. సయీద్ రూమ్‌లో భారీగా డ్రగ్స్ దొరికాయి. ఆయన రూమ్‌లో ఉన్న టాలీవుడ్ హీరోయిన్‌ను అదుపులోకి తీసుకొన్నాం. ఆమె బల్లార్డ్ పీయర్‌లోని ఎన్సీబీ ఆఫీస్‌కు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నాం అని సమీర్ తెలిపారు.

ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్ చేసి
టాలీవుడ్ హీరోయిన్‌ను పూర్తిస్థాయిలో విచారించాలని నిర్ణయించాం. ఆమె వద్ద ఉన్న ఫోన్‌ను, ఎలాక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకొన్నాం. ఆమె అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నాం. టాలీవుడ్‌లో ఆమెకు ఏమైనా సంబంధాలున్నాయా? యాంగిల్‌లో విచారణ జరుపుతున్నాం. త్వరలోనే ఆమెను కోర్టుకు అప్పగిస్తాం అని ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి.

10 లక్షల విలువైన డ్రగ్స్
హీరోయిన్, ఎంఎన్‌సీ ఉద్యోగి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నాం. 10 లక్షల విలువైన 400 గ్రాముల మెఫెడ్రోన్‌ను వారి వద్ద లభించింది. ప్రస్తుతం వారికి ఉన్న ఇతర లింకులపై దృష్టిపెట్టాం. వారి వెనుక ఇంకా ఏదైనా ముఠా ఉందనే కోణంలో ప్రశ్నిస్తున్నాం అని అధికారులు వెల్లడించినట్టు సమాచారం.

బాలీవుడ్ తారలపై ఉక్కుపాదం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌తో ఉన్న డ్రగ్స్ లింకులపై ఎన్సీబీ ఉక్కుపాదం మోపుతున్నది. సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, ఆమె గర్ల్‌ఫ్రెండ్, ఆమె సోదరుడిని విచారించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ కమెడియన్ భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాను కూడా అరెస్ట్ చేయడం తెలిసిందే.