Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టాలీవుడ్ నెం.1 ఎవరు?
తెలుగులో ఎవరు నంబర్ వన్ హీరో అనే ప్రశ్నకు ఒకప్పుడు కీర్తిశేషులు యన్.టి.ఆర్. గారి పేరు ఏకగ్రీవంగా వినపడేది. దాన్ని కాదనే ధైర్యం ఏ హీరోకీ గానీ, వారి అభిమానులకు గాని ఉండేది కాదు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కొన్నాళ్ళపాటు ఆ స్థానంలో కొనసాగారు. తర్వాత చిరంజీవి నంబర్ వన్ స్థానానికి ఎదిగారు. తాను రాజకీయాల్లోకి వచ్చే దాకా ఆయనే నెంబర్ వన్ గా స్థానాన కొనసాగారు.
కానీ ఆయన రాజకీయ ప్రవేశం తర్వాత, ప్రస్తుతం ఆ స్థానానికి పోటీ మొదలయింది. ఇలా పోటీపడుతున్న హీరోల్లో యంగ్‌టైగర్ యన్.టి.ఆర్., ప్రిన్స్ మహేష్ బాబుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో మహేష్ బాబు క్లాస్ హీరో కాగా, యంగ్‌టైగర్ యన్.టి.ఆర్.పక్కా మాస్ హీరో. వీళ్ళిద్దరితో పాటు నటించింది రెండు సినిమాల్లోనే అయినా తాను కూడా పోటీలో వున్నాను అంటున్నాడు రామ్ చరణ్. కానీ అతనిలోని ప్రతిభ ఇంకా పూర్తిగా వెలుగులోకి రావలసి ఉంది. మొదటి స్థానం సంపాదించుకోవాలంటే రాజు నుండి పేద వరకూ, హీరో నుండి విలన్ వరకూ, రాముడి నుండి రావణుడి వరకూ ఎలాంటి పాత్రల్లోనూ నటించి, ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకోవాలే కానీ ఒక్క కలెక్షన్ల వసూలే ప్రాతిపదికగా తీసుకోవటం సరికాదు కదా. ఆ విధంగా చూస్తే రామ్ చరణ్ ఇంకా చాలా కష్టపడాల్సి ఉంది.. నటుడిగా ఇంకా ఎంతో నిరూపించుకోవాల్సి ఉంది. ఇది అతనికి ఆరంభమే కాని అంతం కాదు. కాబట్టి ప్రస్తుతానికి యన్.టి.ఆర్. లేదా మహేష్ బాబులు ఈ స్థానం కోసం పోటీపడుతున్నవారిలో ప్రధాన పోటీదారులుగా చెప్పుకోవచ్చు.