twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ టాప్... హీరో, దర్శకుడు ఎవరు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ఏ రంగంలో అయినా టాప్ పొజిషన్ పై ఎప్పుడూ ఆసక్తికర చర్చ సాగుతుంది. సినిమా రంగంలో అయితే మరీనూ! ప్రేక్షకులు, అభిమానులు టాప్ పొజిషన్ ఎవరికి దక్కుతుందనే దానిపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.....టాలీవుడ్ టాప్ హీరోగా పవన్ కళ్యాణ్, టాప్ దర్శకుడిగా రాజమౌళి కొనసాగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

    గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి హిట్ చిత్రాలతో పవన్ కళ్యాణ్ టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారని స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి రూ. 11 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని, లాభాల్లో 10% షేర్ తీసుకున్నారని సమాచారం. ఇలా రెమ్యూనరేషన్ పరంగా కూడా పవన్ టాప్ అంటున్నారు.

    రెండో స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి గాను మహేష్ కూడా 11 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నరట. అయితే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఇండస్ట్రీ హిట్టయితే మహేష్ టాప్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రూ. 9 కోట్లో ఎన్టీఆర్, రూ. 8 కోట్లతో ప్రభాస్, రూ. 7 కోట్లతో రామ్ చరణ్, 7 కోట్లతో అల్లు అర్జున్, రూ. 4 కోట్లతో రవితేజ, ఆ తర్వాతి స్థానాల్లో రామ్, సిద్ధార్థ, నాని, అల్లరి నరేష్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

    దర్శకుల విషయానికొస్తే...రాజమౌళి రెమ్యూనరేషన్, హిట్ల పరంగా టాప్ పొజిషన్లో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో పూరి జగన్నాథ్, శ్రీను వైట్, వివి వినాయక్ కొనసాగుతున్నారు. హీరోయిన్లలో రూ. 1.5 కోట్లతో కాజల్ మొదటి స్థానంలో, రూ. 1.2 కోట్లతో సమంత రెండో స్థానంలో, ఇలియానా రూ. 1.1 కోట్లతో మూడో స్థానంలో, తమన్నా రూ. 1 కోటితో నాలుగో స్థానంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    English summary
    
 Power star Pawan Kalyan and Rajamouli on Top in Tollywood. Pawan took 11 Crores as remuneration for “Cameraman Ganga Tho Rambabu” and 10% share in profits. Rajamouli is the top director takes 3 Crores and 30+% shares in profits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X