ఈ త్రీ స్టార్స్ లో ఎవరు ముందు ఎవరు వెనుక చెప్పరూ ప్లీస్..!?
ప్రాధమిక సమాచారం ప్రకారం ఇలియానా ఎకౌంట్ లో మరో ఫ్లాప్ పడిపోయింది. 'రెచ్చిపో", 'సలీమ్", 'శక్తి" సినిమాలతోపాటు తాజా చిత్రం 'నేను నా రాక్షసి" కూడా ఇలియానాను నిరాశ పరచనుందనే వార్తలు వెలువడుతున్నాయి కాబట్టి.. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ స్థానం కోసం ఆమె పేరును ఇప్పట్లో పరిగణించాల్సిన అవసరం లేదు. వరుస పరాజయాలతో ఆమె ఇప్పటికే ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకున్న దృష్ట్యా.. భవిష్యత్తులో ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం కూడా కష్టమే. ప్రస్తుతం ఇలియానాకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. ఇక ఈ స్థానం కోసం త్రిష ఇప్పటికీ గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆమెకు అనుష్క నుంచి తీవ్ర స్థాయి పోటీ ఎదురవుతోంది. ఆమధ్య కాస్తంత వెనకబడినప్పటికీ.. అనుష్క మళ్లీ ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.
ఇక కాజల్ కు కూడా 'మగధీర" తర్వాత చెప్పుకోదగ్గ విజయాలు లేవు. 'డార్లింగ్" ఫర్వాలేదనిపించుకున్నా.. 'బృందావనం" నిరాశపరిచింది. తాజా చిత్రం 'మిస్టర్ పర్‌ఫెక్ట్" గురించి ఇప్పుడే చెప్పలేం కాబట్టి.. ప్రస్తుతానికి నెంబర్‌వన్ స్థానం ఆమెది కాదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక సమంత, తమన్నాలు సమీప భవిష్యత్తులో నెంబర్‌వన్ స్థానం కైవసం చేసుకుంటారేమో చెప్పలేం కానీ.. ప్రసుతానికయితే మాత్రం వారిద్దరిలో ఎవరూ నెంబర్‌వన్ కాదు.కాబట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్ స్థానాన్ని అనుష్కకు కట్టబెట్టడం తప్పదనే చెప్పొచ్చు!


Click it and Unblock the Notifications











